వారితోనే వైరస్ ముప్పు… నిన్న మొన్నటి వరకూ నిలకడగానే?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా ఒడిశాలో మాత్రం కేసులు పెద్దగా నమోదు కాలేదు. దాదాపు నెల రోజుల నుంచి కేసులు లేకపోవడంతో అధికారులు సయితం ఊపిరి పీల్చుకున్నారు. మార్చి [more]

Update: 2020-05-16 18:29 GMT

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నా ఒడిశాలో మాత్రం కేసులు పెద్దగా నమోదు కాలేదు. దాదాపు నెల రోజుల నుంచి కేసులు లేకపోవడంతో అధికారులు సయితం ఊపిరి పీల్చుకున్నారు. మార్చి నుంచి ఏప్రిల్ చివరి వారం వరకూ ఒడిశాపై పెద్దగా కరోనా ఎఫెక్ట్ పడలేదు. అయినా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేశారు. కరోనా వ్యాప్తి జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

ఈ నెల ప్రారంభం నుంచే….

అయితే మే నెల ప్రారంభం నుంచే ఒడిశాను కరోనా వైరస్ ఆందోళనకు గురి చేస్తుంది. రోజుకు ముప్పయి కేసులు నమోదవుతుండటంతో నవీన్ పట్నాయక్ అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల అధికారులతో నవీన్ పట్నాయక్ సమీక్షించారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు పెట్టాలని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా పరీక్షలు కూడా ఎక్కువగా చేయాలని నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు.

అందరినీ గుర్తించి….

తొలుత ఒడిశాలో తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ చివరి నాటికి కూడా వంద దాటలేదు. అయితే మే మొదటి వారానికి రెండువందలు దాటడంతో ఆందోళన నెలకొంది. తొలినాళ్లలో ఇతరదేశాల నుంచి, మర్కజ్ మసీదు ప్రార్థనలు, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన వారితో వైరస్ ఒడిశాకు చేరింది. అయితే వీరిందరినీ గుర్తించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం క్వారంటైన్ కు పపండంతో కొంత కట్టడి అయిందనే అనుకున్నారు.

వలస కార్మికులతో….

కానీ కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిచ్చడమే ఒడిశాకు శాపంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు ఒడిశా చేరుకున్నారు. ప్రధానంగా గుజరాత్ లోని సూరత్ నుంచి వచ్చిన వలసకార్మికులతో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిందని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందిన జాజ్ పూర్, భువనేశ్వర్, బాలేశ్వర్, గంజాం, భద్రక్ జిల్లాలను ప్రభుత్వం రెడ్ జోన్లుగా గుర్తించింది. మొత్తం మీద వలస కార్మికుల రాక కారణంగానే వైరస్ వ్యాప్తి చెందడంతో మరోసారి అందరికి పరీక్షలు నిర్వహించాలని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News