వైసీపీ నేతకు ఈసారైనా ఛాన్స్ దక్కుతుందా?

హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ కాంగ్రెస్, వైసీపీ విజయం సాధించడం కష్టమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ టీడీపీ మినహా మరే పార్టీకి [more]

Update: 2021-06-11 14:30 GMT

హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ కాంగ్రెస్, వైసీపీ విజయం సాధించడం కష్టమే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ టీడీపీ మినహా మరే పార్టీకి చోటు లేదు. అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల వ్యవహారంలో మార్పేలేదు. ముఠాలుగా ఏర్పడి పార్టీ అధినాయకత్వానికి తలనొప్పులు తెస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఈసారైనా తనకు టిక్కెట్ దక్కుతుందన్న ఆశలో ఆ పార్టీ నేత నవీన్ నిశ్చల్ ఉన్నారు.

గెలుపే లేక…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ ఏ పార్టీ గెలవలేదు. 1983లో అక్కడ స్వతంత్ర అభ్యర్థి మాత్రమే గెలిచారు. ఆ తర్వాత తొమ్మిది సార్లు జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీదే విజయం అయింది. కాంగ్రెస్ నుంచి, వైసీపీ నుంచి 2004. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ కు టిక్కెట్ ఇవ్వలేదు. అయినా పార్టీ కోసం పనిచేశారు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీకి విజయం దక్కలేదు.

పార్టీనే నమ్ముకుని….

ఇక్కడ 2019 లో పోటీ చేసిన మహ్మద్ ఇక్బాల్ ను జగన్ ఎమ్మెల్సీగా చేశారు. వచ్చే ఎన్నికల సమయానికి ఆయనకు ఇంకా ఎమ్మెల్సీ పదవి ఉండనుంది. దీంతో ఆయనకు ఈసారి టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. దీంతో ఈసారైనా తనకు వైసీపీ టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు నవీన్ నిశ్చల్. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే మహ్మద్ ఇక్బాల్ వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉండటంతో ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈసారి అవకాశం…?

నమ్మకంగా ఉంటే జగన్ కు తనకు పదవి ఇస్తారని నవీన్ నిశ్చల్ భావిస్తున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఓటమి పాలయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తనకు జగన్ మంచి ఫ్యూచర్ చూపుతారన్న విశ్వాసంతో ఉన్నారు. హిందూపురంలో పోటీ చేయడానికి ఈసారి ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ప్రయత్నిస్తున్నారు. సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగా ఈసారైనా నవీన్ నిశ్చల్ కు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఆయన అయితే పార్టీకి నమ్మకంగా ఉండి పనిచేస్తున్నారు.

Tags:    

Similar News