సిద్ధూ ఆలోచన అంతా అదేనట

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరో పార్టీకి జంప్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఇమడల లేక [more]

Update: 2020-06-09 17:30 GMT

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరో పార్టీకి జంప్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ లో ఇమడల లేక పోతుండటంతో ఆయన త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. సిద్ధూ వస్తే పార్టీ స్వాగతిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దీంతో సిద్ధూ చేరిక త్వరలోనే ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది.

బీజేపీ నేతగా ఎదిగి….

నవజ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నేతగా ఉన్నారు. తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు. పంజాబ్ ఎన్నికలకు ముందు 2017లో సిద్ధూ బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పంజాబ్ లో అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ పోషించిన పాత్ర ను కాంగ్రెస్ తక్కువగా అంచనా వేసింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి అమరీందర్ సిద్ధూను పక్కకు తప్పించాలనే తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రితో విభేదాలు….

ముఖ్యమంత్రికి, సిద్ధూకు మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ విజయానికి కారణమైన తనను పక్కన పెట్టడంపై సిద్ధూ తొలి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖ కేటాయింపులోనే తనపై వివక్ష చూపారని సిద్ధూ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. అంతేకాదు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

కీలక పదవి కోసం…..

ప్రస్తుతం సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. ఈ మేరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా జరిపినట్లు తెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని సిద్ధూ కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మాత్రం సిద్ధూకు అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారంటున్నారు. పంజాబ్ లో కొంత బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తనకు సరైన వేదిక అని సిద్ధూ భావిస్తున్నారు. మరి ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News