ద్వారాలు ఎందుకు తెరిచారు…??

భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం బలంగానే ఉంది. సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం కమలం [more]

Update: 2019-04-11 17:30 GMT

భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం బలంగానే ఉంది. సర్వేలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం కమలం పార్టీలో కొంత కలవరం రేపుతుంది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఈసారి వస్తాయో? లేదో? సందేహమే. ఎందుకంటే గత ఎన్నికలకు ముందున్న మోదీ క్రేజ్ ఇప్పుడు లేదు. అలాగని పూర్తిగా గ్రాఫ్ పడిపోలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతమయింది.

కాంగ్రెస్ దూసుకుపోతుందనేనా?

కాంగ్రెస్ “న్యాయ్” పథకం దేశవ్యాప్తంగా పేదవర్గాలను హస్తం పార్టీకి దగ్గర చేరుస్తాయన్నది వాస్తవం. నెలకు ఆరువేల రూపాయలు ఉచితంగా తమ బ్యాంకు ఖాతాలో పడతాయంటే ఎవరైనా ఎందుకు మొగ్గు చూపరు? అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం గ్రామీణ ప్రాంతంపై పడింది. జీఎస్టీ ప్రభావం వ్యాపార వర్గాలపై ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధాని నరేంద్రమోదీపై గత ఎన్నికలకు ముందు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు కమలం పార్టీకి దూరమవుతారనే సందేహాలున్నాయి.

ప్రాంతీయ పార్టీలదే హవా…..

అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశంలేదు. ఇక ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పకతప్పదు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో ప్రాంతీయ పార్టీల జోరు ఎక్కువగా కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తరాదిని కొద్దో గోప్పో సీట్లు సాధించుకున్నా దక్షిణాదిన దెబ్బపడే అవకాశముంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ భారతీయ జనతా పార్టీ ఒక్కటే చేరుకునే అవకాశం లేదు.

శత్రువులతోనైనా…..

అందువల్లనే ప్రధాని నరేంద్ర మోదీ బద్ధ శత్రువులతోనైనా చేతులు కలుపుతామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందుగాని, అనంతరం గాని ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శత్రువైనా సరే ఎన్డీఏలో చేర్చుకుంటామని ద్వారాలు తెరిచారు. మమ్మల్ని ద్వేషించే పార్టీలకు కూడా ఆయన స్వాగతం పలికారు. అంటే నరేంద్ర మోదీకి మ్యాజిక్ ఫిగర్ కు చేరువకాలేమోనన్న భయం పట్టుకుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే ఎన్నికల తర్వాత తమ దరికి వస్తే కౌగిలించుకోవడానికి రెడీ అని ప్రకటించడం బీజేపీ గెలుపు సందేహాలను బయట పెడుతోంది.

Tags:    

Similar News