మోదీ మర్చిపోలేకపోతున్నారా..?

నరేంద్రమోదీ ఈ దేశ ప్రధాని. ఆయన రెండు సార్లూ మంచి మెజారిటీతో దేశంలో అధికారంలోకి వచ్చారు. ఇక సంకీర్ణ రాజకీయాలతో గత మూడు దశాబ్దాలుగా నలిగిపోతున్న దేశానికి [more]

Update: 2019-08-17 05:00 GMT

నరేంద్రమోదీ ఈ దేశ ప్రధాని. ఆయన రెండు సార్లూ మంచి మెజారిటీతో దేశంలో అధికారంలోకి వచ్చారు. ఇక సంకీర్ణ రాజకీయాలతో గత మూడు దశాబ్దాలుగా నలిగిపోతున్న దేశానికి దిక్సూచిగా ఆయన నిలబడి స్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించి చూపించారు. ఆ ఫీట్ వాజ్ పేయ్, సోనియా లాంటి వారికి కూడా చేతకాలేదు. అంతకు ముందు గుజరాత్ సీఎం గా నరేంద్రమోదీ పదమూడేళ్ల పాటు నిరాటంకంగా పాలించారు. అంటే పద్దెనిమిదేళ్ళుగా నరేంద్రమోదీ కీలకమైన రాజకీయ పాత్రలోనే దేశంలో ఉన్నారు. మరో అయిదేళ్ల పాటు ఆయన ప్రధానిగా ఉండబోతున్నారు. నరేంద్రమోదీ ఇన్ని విజయాలు సమకూరడానికి గల కారణం ఆయన పట్టుదల అని అంటారు. దాన్ని గిట్టని వారు మొండితనం అని కూడా అంటారు. నరేంద్రమోదీకి రాజకీయాలు బాగా తెలుసు. అదే సమయంలో ఆయన ఒకసారి ద్వేషించి వారిని ఎంతటి వారైనా దగ్గరకు తీయడం మాత్రం ఆయన రాజకీయ చరిత్రలోనే లేదంటారు.

బాబుపై అదే తీరు….

నరేంద్రమోదీ గుజరాత్ సీఎం గా ఉన్నపుడు జరిగిన గోద్రా అల్లర్ల ఘటనలో ఆయన్ని ముందు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోమ్మనాలని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం గా చంద్రబాబు డిమాండ్ చేయడాన్ని నరేంద్రమోదీ ఎప్పటికీ మరచిపోలేరు. ఎందుకంటే నాటి ఎన్డీయే సర్కార్ కి బయట నుంచి మద్దతు ఇస్తున్న బాబుకు వాజ్ పేయి తో మంచి సంబంధాలు ఉన్నాయి. నరేంద్రమోదీ విషయంలో తన మాట వినకపోతే ఎన్డీయే నుంచి తప్పుకుంటానని దాదాపు బెదిరింపు ధొరణిలో బాబు మాట్లాడడంతో నాడు నరేంద్రమోదీ సీఎం కుర్చీ ఎగిరిపోయే పరిస్థితి దాదాపుగా వచ్చేసింది. మెడ మీద కత్తిలా రాజకీయం మొత్తం ఎదురుతిరిగే వాతావరణం కూడా ఏర్పడింది. బాబు డిమాండ్ తరువాతనే ఎన్డీయే పక్షాలు కూడా పెదవి విప్పి నరేంద్రమోదీని గద్దె దించాలని అడగాల్సివచ్చింది. అంటే నాటి అగ్నికి అంకురార్పణ చేసి ఆజ్యం పోసింది చంద్రబాబు అన్నది నరేంద్రమోదీకి బాగా గుర్తుండిపోయింది. గురువు అద్వానీ రాజకీయంతో నాటి గండం నుంచి నరేంద్రమోదీ బయటపడినా బాబు అంటే ఆ కోపం అలాగే ఉంది అంటారు. ఇక 2014 ఎన్నికలో టీడీపీతో చెలిమిని కుదిర్చింది అద్వానీ, వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ నేతలు వంటి వారే తప్ప నరేంద్రమోదీ కాదన్నది అందరికీ తెలిసిందే. అపుడే జాతీయ రాజకీయాల్లోకి కొత్తగా రావడంతో నరేంద్రమోదీ పెద్దగా పొత్తులపై సొంత మాట నెగ్గించుకోని పరిస్థితి అది.

కేసులు పెడతారట….

ఇక చంద్రబాబు 2014 ఎన్నికల తరువాత ఏపీకి సీఎం అయ్యాక, వెంకయ్యనాయుడు సాయం బాగా లభించాక ఎలా కత్తెర వేయాలో అదను చూసి పదును పెట్టిన నేత నరేంద్రమోదీ. ఎన్డీయే నుంచి బాబు వెళ్ళిపోవడం నరేంద్రమోదీకి ఇష్టమేనని నాటి ఘటనలు రుజువు చేశాయి. ఇక బీజేపీలో నరేంద్రమోదీ తప్ప నితిన్ గడ్కరీ, రాజ్ నాధ్ సింగ్ వంటి వారిని మద్దతు ఇస్తామని బాబు తెరచాటు బేరాలు తాజా ఎన్నికల ముందు చేసిన వైనాన్ని నరేంద్రమోదీ మరచిపోరు. ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీల జట్టు కట్టి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా దేశంలో చక్రం తిప్పడానికి బాబు పడిన పాట్లు కూడా నరేంద్రమోదీ దృష్టి నుంచి దూరంగా పోలేవు. ఇవన్నీ చూసిన తరువాత నరేంద్రమోదీ బాబుని ఇపుడు వదిలేస్తారా. బీజేపీలో నాయకుల తీరు ఎలా ఉన్నా నరేంద్రమోదీ మాత్రం బాబుని వదిలిపెట్టరన్న చర్చ సాగుతోంది. బాబుకు బలం ఇస్తే ఆయన మళ్ళీ లేచి నిలబడి ఇదే తీరున సవాల్ చేస్తాని కూడా నరేంద్రమోదీకి బాగా తెలుసు. అందుకే బాబు మీద అవినీతి కేసులను తిరగతోడాలని నరేంద్రమోదీ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు సీనియర్ మోస్ట్ లీడర్ ఎలా ఉన్నారని నరేంద్రమోదీ అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా నరేంద్రమోదీ, జగన్ మధ్య బాబు ప్రస్తావన తప్పకుండా వస్తుందన్నది అందరికీ తెలిసిందే. ఉమ్మడి శత్రువుగా బాబు ఉండడం వల్ల జగన్ సైతం అదే కోరుకుంటారు. ఢిల్లీ వార్తలే నిజమైతే మరో రెండు మూడు నెలల తరువాత బాబు తీవ్రమైన ఇబ్బందుల్లో పడబోతున్నారని టాక్. మరి బాబు దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News