Narendra modi : మోదీ @ 20 ఇయర్స్

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలోకి వచ్చి ఇరవై ఏళ్లు కావస్తుంది. రెండు దశాబ్దాలుగా మోదీ ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి మోదీ ఎక్కడా [more]

Update: 2021-10-05 16:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవలోకి వచ్చి ఇరవై ఏళ్లు కావస్తుంది. రెండు దశాబ్దాలుగా మోదీ ప్రజా జీవితంలోకి వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి మోదీ ఎక్కడా అపజయం అన్నది చూడలేదు. ఆయన పొలిటికల్ గ్రాఫ్ పెరగడమే తప్ప తరిగింది ఇంతవరకూ లేదు. మోదీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ఆయన పదవులకు వన్నె తెచ్చారు. మోదీ ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనలేదు.

2001లో ముఖ్యమంత్రిగా…

నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 13 ఏళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ కొనసాగారు. గుజరాత్ అభివృద్ధి మాత్రమే ఆయనకు ఢిల్లీ పీఠం దక్కిందని చెప్పాలి. గుజరాత్ లో జరిగిన అభివృద్ధిని చూసి దేశాన్ని కూడా అదే బాటలో నడుపుతారని దేశం మొత్తం భావించింది. అందుకే ఆయన సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ రెండుసార్లు వరసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.

మోదీ ఇమేజ్ తోనే…

ఒక రకంగా చెప్పాలంటే మోదీ ఫేస్ కమలం పార్టీకి బాగా ఉపయోగపడింది. అదే సమయంలో బీజేపీని సరైన ట్రాక్ లో మోదీ నడిపారు. దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ అనేక రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరిందంటే మోదీ చరిష్మాయే కారణమని వేరే చెప్పనక్కరలేదు. జనాన్ని ఆకట్టుకోవడంలో దేశంలో ఇందిరాగాంధీ తర్వాత అంతటి నేతగా మోదీని అభివర్ణించక తప్పదు. ఆయన ప్రసంగంలో చెణుకులు, హావభావాలు జనాలను మెస్మరైజ్ చేస్తాయి.

పెద్దయెత్తున కార్యక్రమాలు…

మోదీ ప్రజాసేవలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్న సందర్భంగా బీజేపీ దేశంలో పెద్దయెత్తున సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 7వ తేదీన దేశ వ్యాప్తంగా బీజేపీ కార్యక్రమాలను నిర్వహించనుంది. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7న నదులను క్లీన్ చేయడం, మోదీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటివి దేశ వ్యాప్తంగా చేపట్టనున్నారు. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి కేంద్ర మంత్రుల వరకూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్లాన్ చేశారు.

Tags:    

Similar News