అమ్మేయడానికే రెండోసారి వచ్చినట్లుంది

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ అమ్మకాలకే పెట్టినట్లు కనపడుతుంది. ప్రజా శ్రేయస్సు కోసమే తాము ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు వెనుకాడబోమని [more]

Update: 2021-03-29 17:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ అమ్మకాలకే పెట్టినట్లు కనపడుతుంది. ప్రజా శ్రేయస్సు కోసమే తాము ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించేందుకు వెనుకాడబోమని మోదీ ప్రభుత్వం ప్రకటించడం దేశ వ్యాప్తంగా ఆందోళనకు కారణమయింది. రైల్వేలు, విమానయాన సంస్థలు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఇలా ఒక్కటమేమిటి అన్ని రంగాలను ప్రయివేటు పరం చేయాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

నోట్ల రద్దు వంటి వాటిని …..

2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా ప్రజా వ్యతిరేక చర్యలకు దిగలేదు. నోట్ల రద్దు చేసినా ప్రజలు ఓపిగ్గా దానిని అంగీకరించారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రయివేటు సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు కారణమయింది. మోదీకి పాలన చేతకాదన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి.

ఇక ప్రభుత్వం ఎందుకు?

ప్రభుత్వ రంగం సంస్థలను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని ప్రయివేటీకరించుకుంటూ పోతే ఇక ప్రభుత్వం ఎందుకు అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నిజానికి గనులు కేటాయిస్తే లాభాల బాట పడుతుంది. కానీ గనులు కేటాయించకుండా దానిని ప్రయివేటు వ్యక్తులకు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేలు ప్రయివేటకరిస్తే సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయాణం మరింత భారం కానుంది.

రాష్ట్రాలకు కూడా……

ఇక తాజాగా మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను కూడా ప్రయివేటీకరించాలని ప్రయత్నిస్తుంది. రాష్ట్రం ఆ పనిచేస్తే తాము ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధమని మోదీ ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటు అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ ను కేటాయించింది. మొత్తానికి మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం అమ్మకాలపై దృష్టి పెట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News