అందుకే అంతకాలం ఆగాల్సి వచ్చిందా?

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ చేపట్టక పోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ [more]

Update: 2021-04-08 16:30 GMT

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ చేపట్టక పోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ఎప్పటికప్పుడు ఢిల్లీలో విన్పిస్తున్న ప్రచారం ప్రచారంగానే మిగిలిపోయింది. మంత్రి వర్గ విస్తరణ కోసం అనేక మంది ఆశావహులు ఎదురు చూపులు చూస్తున్నారు. నిజానికి బీహార్ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు.

ప్రచారం ఆరు నెలల నుంచి…..

మోదీ కార్యాలయం మంత్రి వర్గ విస్తరణ కోసం కసరత్తులు చేస్తుందన్న ప్రచారమూ జరిగింది. కొందరు మంత్రుల పనితీరు పట్ల మోదీ అసంతృప్తిగా ఉన్నారని అనేక రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే గత ఏడాది మార్చిలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత బీహార్ఎన్నికల తర్వాత అన్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాతనే మోదీ తన మంత్రి వర్గ విస్తరణ జరిపే అవకాశముంది.

పనితీరును బేరీజు వేసేందుకు….

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకునేందుకు మోదీకి అవకాశం చిక్కింది. ఇటు రైతుల ఆందోళన, ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ వంటి అంశాలతో అనేక వర్గాలు మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నాయంటున్నారు. ఈ ఫలితాలతో అందులో నిజానిజాలను తెలిసే అవకాశముంటుంది. ఈ ఫలితాలను బట్టి మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్నది మోదీ భావనగా ఉంది.

పూర్తి ప్రక్షాళన దిశగా…..

దాదాపు పది మంది మంత్రుల పనితీరు పట్ల మోదీ సంతృప్తికరంగా లేరు. యువత కు ప్రాధాన్యం ఇవ్వాలన్నది మోదీ ఆలోచన. వచ్చే పార్లమెంటు ఎన్నికలకు మంచి టీమ్ ను ఎంపిక చేయాలన్నది మోదీ ఉద్దేశ్యంగా కన్పిస్తుంది. అందుకే జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారికి ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదని చెబుతున్నారు. ఆర్థిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ ను కూడా ఆ పదవి నుంచి తప్పించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. మోదీ కేబినెట్ విస్తరణ మే 2వ తేదీ తర్వాతే ఉంటుందన్నది తాజా అప్ డేట్.

Tags:    

Similar News