కొత్త చరిత్ర – భరోసా నాది

కాశ్మీర్ లోని కోటిన్నర మంది ప్రజలకు న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కాశ్మీర్ లో [more]

Update: 2019-08-08 15:14 GMT

కాశ్మీర్ లోని కోటిన్నర మంది ప్రజలకు న్యాయం చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత మోదీ తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కాశ్మీర్ లో 45 వేల మంది అమాయకులు చనిపోయారన్నారు. అందుకే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు. కాశ్మీర్ లో కొత్త చరిత్ర ప్రారంభమయిందన్నారు. కాశ్మీర్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆర్టికల్ 370 అవినీతి కుటుంబ పాలన రాజ్యమేలిందని మోదీ తెలిపారు. దానిని తొలగించడంతో జమ్మూ, లడఖ్ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. కాశ్మీర్ ప్రజలందరికీ సమాన హక్కులు లభించాయని చెప్పారు. కాశ్మీర్ అభివృద్ధికి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చామని మోదీ గుర్తు చేశారు. విభజన తర్వాత కాశ్మీర్ ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే కాశ్మీర్ లో ఉగ్రవాదం అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాక్ ఆయుధంగా వాడుకుని….

పాకిస్థాన్ ఇప్పటి వరకూ 370 ఆర్టికల్ ను ఒక ఆయుధంగా వాడుకుందన్నారు మోదీ. జమ్మూకాశ్మీర్ ఉద్యోగులకు కొత్త ప్రయోజనాలు తమ చర్యల ద్వారా కలుగుతాయని చెప్పారు. వారికి కేంద్రపాలిత ప్రాంతం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు దక్కుతాయన్నారు. కొద్దిరోజులు మాత్రమే జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. ఒకటే భారతం ఒకటే రాజ్యాంగం కల సాకారమయిందన్నారు. చాలా ఆలోచించి కాశ్మీర్ విభజన చేశామని మోదీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు కాశ్మీర్ లో ఇప్పటి వరకూ రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు.

త్వరలోనే ఎన్నికలు…..

త్వరలో కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని, పంచాయతీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని, యువకులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రి పదవిని కూడా పొందవచ్చని తెలిపారు. కాశ్మీరీలు తమకు నచ్చిన నేతలను సీఎంగా ఎన్నుకోవచ్చన్నారు. పారదర్శక పాలన అందిస్తామని మోదీ చెప్పారు. విద్యాహక్కు చట్టం దేశమంతా అమలయిందని, కాశ్మీర్ లో అమలుకు నోచుకోలేదన్నారు. అందుకే కాశ్మీర్ పిల్లలు చదువుకు దూరమయ్యారన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు సహకరిస్తారని తనకు నమ్మకం ఉందని మోదీ తెలిపారు. ఉగ్రవాదాన్ని తరిమికొడతారని తెలిపారు. ఇప్పుడు కాశ్మీరీలకు అన్ని రకాలుగా భద్రత ఏర్పడిందన్నారు. కాశ్మీర్ ప్రజలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. కాశ్మీర్, లడఖ్ అతి పెద్ద టూరిస్ట్ స్పాట్ లుగా మారతాయన్నారు. ఫిలిం షూటింగ్ లు కూడా జరుగుతాయని చెప్పారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమకు మోదీ సినిమా షూటింగ్ లు జరపాలని విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ అభివృద్ధిపై భరోసా తనదని చెప్పారు.

Tags:    

Similar News