ఏం సాధించారు..? పొగడ్తలన్నీ వేస్టేనా?

లాక్ డౌన్ విధింపుతో కరోనా వైరస్ కట్టడి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించింది. మార్చి 24వ తేదీన దేశవాప్తంగా తొలి విడత లాక్ డౌన్ ను విధించింది. [more]

Update: 2020-05-21 18:29 GMT

లాక్ డౌన్ విధింపుతో కరోనా వైరస్ కట్టడి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం భావించింది. మార్చి 24వ తేదీన దేశవాప్తంగా తొలి విడత లాక్ డౌన్ ను విధించింది. తాజాగా మే 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ముందుగానే విధించడంతో కరోనా కేసులు తక్కువగా భారత్ లో నమోదయ్యాయి. దీంతో నరేంద్ర మోదీని ప్రపంచ దేశాలన్నీ ప్రశంసించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మెచ్చుకుంది. లాక్ డౌన్ తో కరోనా కట్టడి అయినట్లేనని మోదీ కూడా భావించారు.

ప్రజలను చైతన్య పర్చేందుకు…

అందుకే ప్రజలు ముందుకు తరచూ వచ్చి ఏదో ఒక కార్యక్రమం చేపట్టారు. తొలుత వైద్యులకు, పారిశుద్ధ కార్మికులకు చపట్లు కొట్టే కార్యక్రమం పెట్టారు. తర్వాత దీపాలు వెలిగించారు. ఇదంతా ప్రజలను చైతన్య పర్చడంలో భాగమే. దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ పిలుపునకు ప్రజలు సహకిరించారు. ఇలాగే ప్రజలు సహకరిస్తే కరోనాను తరిమికొట్టవచ్చని మోదీ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. అధికారుల్లో కూడా కాన్ఫిడెన్స్ కన్పించింది.

వైరస్ వ్యాప్తి ఇలా…..

తొలుత తబ్లిగి నుంచి వైరస్ విజృంభించింది. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లిన వారి నుంచి కరోనా వైరస్ ఇతర రాష్ట్రాలకూ అంటుకుంది. వీరిని గుర్తించడంలో అధికారులకు తల ప్రాణం తోకకు వచ్చినట్లయింది. అలాగే రోహింగ్యాల నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందడంతో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. వలస కార్మికులను తరలించే కార్యక్రమం చేపట్టింది. ఇది కూడా వ్యాధి రాష్ట్రాలకు అంటుకుంది. తర్వాత మూడో విడత లాక్ డౌన్ మినహాయింపుల్లో భాగంగా మద్యం షాపులకు అనుమతి ఇచ్చారు.

లక్ష దాటేయడంతో…..

ఇక నాల్గో విడత లాక్ డౌన్ లో అన్ని రకాల మినహాయింపులు ఇచ్చారు. ఇప్పటికే భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. మరణాల సంఖ్య కొంచెం అదుపులో ఉన్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో చైనాను భారత్ దాటేసింది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండం, రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేకపోవడంతో మోదీ సర్కార్ పూర్తి స్థాయి గేట్లు ఎత్తివేసింది. ఇది కరోనా కేసుల సంఖ్యను మరింత పెంచుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News