గురి చూసి కొట్టారుగా… విలవిలలాడక తప్పదా?

లాక్ డౌన్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. విదేశీ వస్తువులపై మోజును తగ్గించింది. కుటుంబ బాంధవ్యాలను పెంచింది. ప్రతి ఇంట్లో కరోనా దూరకున్నా పొదుపు పాఠాన్ని మాత్రం నేర్పింది. [more]

Update: 2020-05-13 16:30 GMT

లాక్ డౌన్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది. విదేశీ వస్తువులపై మోజును తగ్గించింది. కుటుంబ బాంధవ్యాలను పెంచింది. ప్రతి ఇంట్లో కరోనా దూరకున్నా పొదుపు పాఠాన్ని మాత్రం నేర్పింది. ఇప్పుడు భారత్ కూడా కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థను పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే మోదీ లోకల్ నినాదాన్ని తీసుకువచ్చారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మోదీ ఒక రకంగా చైనాకు సరైన సమయంలో గుణపాఠం చెప్పేందుకే రెడీ అయిపోయారని చెప్పాలి.

తొలి నుంచి పాక్ కు…..

చైనాకు భారత్ మిత్రదేశమేమీ కాదు. చైనా తొలి నుంచి భారత్ శత్రుదేశమైన పాకిస్థాన్ కు మద్దతు ఇస్తూనే వస్తోంది. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ను అన్ని రకాలుగా కట్టడి చేయడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తుంది. చైనాకు భారత్ అతి పెద్ద మార్కెట్ అయినప్పటికీ విదేశాంగ విధానంలో మాత్రం చైనా భారత్ ను ఏనాడు సపోర్ట్ చేయలేదు. సరిహద్దుల్లోనూ ఉద్రిక్తతలను రేపుతోంది. లడఖ్, సిక్కింలలో చోటు చేసుకున్న సంఘటనలే ఇందుకు ఉదాహరణగా చెప్పకతప్పదు.

భారత్ అతి పెద్ద మార్కెట్….

ఇక చైనా ఉత్పత్తులు భారత్ లో ఇబ్బడి ముబ్బడిగా కన్పిస్తాయి. బ్రష్ నుంచి టీవీ నుంచి మొబైల్ వరకూ అన్ని చైనా ఉత్పత్తులే. ప్రతి ఇంట్లో నిత్యం వినియోగించుకునే వస్తువుల్లో కూడా చైనా బ్రాండ్ లు కన్పిస్తాయి. తక్కువ ధర కావడంతో ప్రజలు సయితం చైనా ఉత్పత్తులకే మొగ్గు చూపుతూ వచ్చారు. కానీ కరోనా సమయం భారత్ కు కలసి వచ్చింది. కరోనా వ్యాప్తికి కారణమైన చైనాను ప్రపంచ దేశాలన్నీ దోషిగా చూస్తున్నాయి.

లోకల్ నినాదంతో….

ఈ నేపథ్యంలోనే చైనాకు చెక్ పెట్టేందుకు మోదీ లోకల్ నినాదాన్ని తీసుకు వచ్చారు. ఎక్కడికక్కడ భారత్ లో తయారీ అయ్యే వస్తువులకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహాకాలు ఇవ్వనుంది. దీంతో మన వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశముంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఇదే మంచి సమయమని మోదీ భావించి లోకల్ – వోకల్ నినాదాన్ని తీసుకు వచ్చారు. చైనాకు కళ్లెం వేయాలంటే స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మోదీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తందో తెలియదు కాని, చైనా వేగాన్ని కొంతవరకూ నియంత్రించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Tags:    

Similar News