ఇక ఎవరూ ఆపలేరా?

విజయాలు ఎపుడూ నెత్తిమీదే ఉంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని కిందకు దించుకోవడం బహు కష్టమే. మరి నరేంద్ర మోడీ గురించి చెప్పుకోవాలంటే ఆయన జీవితంలో అపజయాల పాలు [more]

Update: 2019-10-21 16:30 GMT

విజయాలు ఎపుడూ నెత్తిమీదే ఉంటాయి. ఎంత కాదనుకున్నా వాటిని కిందకు దించుకోవడం బహు కష్టమే. మరి నరేంద్ర మోడీ గురించి చెప్పుకోవాలంటే ఆయన జీవితంలో అపజయాల పాలు చాలా చాలా తక్కువ. ప్రధాని అయ్యాక ఎక్కడో ఒకటి రెండు రాష్ట్రాలో బీజేపీ ఓటమి పాలు అయింది. దాన్ని మోడీ ఖాతాలో వేశారంతే. ఇక మోడీ బస్తీ మే సవాల్ అంటూ తొడగొట్టిన ప్రతీ సారీ భారీ విజయమే పలకరించింది. ఇక మూడు దశాబ్దాలుగా సంకీర్ణ రాజకీయంలో అతలాకుతలం అవుతున్న భారతావ‌నికి 2014లో తొలిసారిగా సుస్థిర ప్రభుత్వం ఇచ్చిన ఘనత కూడా మోడీదే. మొదటిదే అద్భుతం అనుకుంటే 2019 ఎన్నికల్లో మరో మారు మ్యాజిక్ రిపీట్ చేసి మోడీ తాను మొనగాడు అనిపించుకున్నారు.

మళ్ళీ విజయభారమేనా…?

ఇక ఇపుడు మోడీ నెత్తి మీద మళ్ళీ విజయాల భారం పడబోతోంది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దానికి ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ కంటే కూడా ప్రత్యర్ధుల ముఖాలు చూస్తే మోడీ గెలుపు ఏంటన్నది స్పష్టంగా తెలిసిపోతోందని అంటున్నారు. ముఖ్యంగా వరసగా మహారాష్ట్రలో రెండవమారు విజయం సాధించడం గొప్ప రికార్డు. దానికి కనుక మోడీ అందిపుచ్చుకుంటే ఆయన్ని ఎవరూ ఇక ఆపలేరని అంటున్నారు. ఇప్పటికే మోడీ అయిదేళ్లలో చేయాల్సిన పెద్ద పనులన్నీ చేశారు. ఎవరూ కలలో కూడా ఊహించని కాశ్మీర్ సమస్యకు సామరస్య ముగింపు కనుగొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అయితే ఆకాశం భూమి కలసిపోతాయన్న సూడో సెక్యులరిస్టుల భ్రమలకూ తెరదించేసి కూల్ గా హాట్ డెసిషన్ తీసుకున్నారు. ట్రిపుల్ తలాక్ అంటూ ముస్లిం సమాజం మద్దతూ చూరగొన్నారు.

రాముడు దీవిస్తాడా…?

ఇక కీలకమైన రెండు రాష్ట్రాలో విజయం కనుక దక్కితే అయోధ్య వివాదం కూడా ఓ కొలిక్కి మోడీ తెస్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మానిఫేస్టోలో అయోధ్య అంశం ఉండకుండా చేస్తారని కమలనాధులు గట్టిగా చెబుతున్నారు. ఇక మోడీ వీటిని మించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలకు అడుగులు వేస్తారని అంటున్నారు. దాంతోనే ఇపుడు రాజకీయ ప్రత్యర్ధుల గుండెలు పీచ్ పీచ్ మంటున్నాయి. మోడీకి వరస విజయాలు దక్కితే మరింత మొండిగా మారురారని, దాంతో కొరకరాని కొయ్యగా మారితే తమగతేం కానని ప్రత్యర్ధులు విల‌విల్లాడుతున్నారు. అయితే మోడీ అజెండాలో రాజకీయ శత్రు సంహారంతో పాటు, ఎప్పటికీ బీజేపీ అధికారంలో కొనసాగేలా రాజ్యాంగంలో సమూల మార్పులు చేసే ప్రతిపాదనలూ ఊన్నాయని అంటున్నారు. మీరు ఇచ్చిన బలంతోనే సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను అని ఇటీవలే హర్యానా ఎన్నికల సభల్లో చెప్పిన మోడీ మళ్ళీ జనాదేశం అనుకూలంగా ఉంటే ఇక రాజకీయ మైదానంలో మెరుపు షాట్లు తీస్తూ తెగ‌ రెచ్చిపోతారని అంటున్నారు.

Tags:    

Similar News