Narayana swamy : ఏంది స్వామీ ఇదీ.. చేజేతులా చేసుకున్నదేగా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో నారాయణస్వామి అట్టర్ ఫెయిల్యూర్ మంత్రిగా ముద్రపడ్డారు. ఆయనకు అప్పగించిన శాఖల్లో సరైన పనితీరు కనపర్చకపోవడంతోనే జగన్ ఆయన శాఖను తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. [more]

Update: 2021-10-31 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో నారాయణస్వామి అట్టర్ ఫెయిల్యూర్ మంత్రిగా ముద్రపడ్డారు. ఆయనకు అప్పగించిన శాఖల్లో సరైన పనితీరు కనపర్చకపోవడంతోనే జగన్ ఆయన శాఖను తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. నారాయణస్వామి చిత్తూరు జిల్లాకు చెందినా అక్కడ మంత్రి పదవుల్లో బలమైన పోటీ ఉన్నప్పటికీ జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖతో పాటు డిప్యూటీ చీఫ్ మినస్టర్ ను కూడా చేశారు.

కీలకమైన శాఖలు….

అయితే నారాయణస్వామి తన శాఖలపై పెట్టే శ్రద్ధ కన్నా ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనకు రెండు శాఖలు అప్పగించారు. రెండూ రాష్ట్రానికి ఆదాయాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టేవే. అందులో ఎక్సైజ్ శాఖ ప్రధానమైనది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మద్య నిషేధాన్ని దశలువారీగా అమలు చేయాలని నిర్ణయించింది. మద్యం బ్రాండ్ల విష‍యంలోనూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు నారాయణ స్వామి సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు.

సీఎంవోకు ఫిర్యాదులు….

వాణిజ్య పన్నుల శాఖ కూడా రాష్ట్ర ఆదాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కానీ నారాయణస్వామి ఈ శాఖపైన కూడా పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. దీంతో పాటు ఆ శాఖ నుంచి అనేక ఆరోపణలను సీఎంవోకు చేరాయంటున్నారు. అయినా మంత్రి దృష్టి పెట్టకపోవడంతో నారాయణస్వామిని ఆ శాఖ నుంచి జగన్ తప్పించారన్న టాక్ నడుస్తుంది. అనేక సార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో ఆర్థిక మంత్రికి ఆ శాఖను కట్టబెట్టాల్సి వచ్చిందంటున్నారు.

తిరుపతికే పరిమితం….

నారాయణస్వామి ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే ఉంటారు. తాను గెలిచిన గంగాధర నెల్లూరు నియోజకవర్గం కంటే తిరుపతిలోనే ఎక్కువగా ఉంటారు. ఆయన నివాసం కూడా తిరుపతే. డిప్యూటీ మంత్రిగా కేవలం తిరుపతికే నారాయణస్వామి పరిమితమవుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో విన్పిస్తున్నాయి. అనేక కారణాలతోనే మంత్రి శాఖను తొలగించారని తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు ముందే నారాయణస్వామి శాఖల్లో కోత విధించడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News