నిలువరించలేక… నిలబడేందుకు…?

పాపం నారాయణ స్వామి. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఉన్నప్పటికీ కిరణ్ బేడీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి కంటి మీద కునుకులేదు. పాలన వ్యవహారాల్లో [more]

Update: 2021-01-19 18:29 GMT

పాపం నారాయణ స్వామి. ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు ఉన్నప్పటికీ కిరణ్ బేడీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వచ్చినప్పటి నుంచి కంటి మీద కునుకులేదు. పాలన వ్యవహారాల్లో తలదూర్చడం, ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెట్టడం వంటి చర్యలతో కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామికి మధ్య దూరం బాగా పెరిగింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పడు లెఫ్ట్ నెంట్ గవర్నర్ పై నారాయణస్వామి పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు.

బేడీ వచ్చిన నాటి నుంచే….

పుదుచ్చేరి అతి చిన్న రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నారాయణస్వామి కుదురుకునేలోగానే కేంద్ర ప్రభుత్వం లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీని నియమించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ ప్రారంభమయింది. దాదాపు మూడేళ్ల నుంచి నారాయణస్వామి బాధ దిగమింగుకుంటూనే పాలన సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కిరణ్ బేడీని నిలువరించడం నారాయణస్వామికి సాధ్యం కావడం లేదు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా…..

కిరణ‌్ బేడీపై నారాయణస్వామి న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినా ఫలితం లేదు. రాష్ట్రపతిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. కానీ ఏమాత్రం అనుకూలత రాలేదు. రోజువారీ వ్యవహారాల్లోనూ కిరణ‌ బేడీ జోక్యం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఫైళ్లను తొక్కిపెడుతున్నారు. అధికారులతో తనకు తానే సమీక్షలు నిర్వహించారు. కిరణ్ బేడీకి వ్యతిరేకంగా నారాయణస్వామి అసెంబ్లీలో తీర్మానం చేశారు. కానీ కిరణ్ బేడీ ఎక్కడా తగ్గలేదు. ప్రభుత్వంలో అవినీతి పెరిగిందంటూ ఆమె హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం ఇబ్బందిలో పడుతుంది.

ప్రత్యక్ష పోరాటం…..

ఎన్నికల సమీపిస్తున్న సమయంలో నారాయణస్వామి కిరణ‌్ బేడీపై ప్రత్యక్ష పోరాటానికి దిగారు. కిరణ‌ బేడీ ని రీకాల్ చేయాలంటూ ఆందోళనలకు నారాయణస్వామి పిలుపునిచ్చారు. ప్రజల నుంచి కిరణ్ బేడీకి వ్యతిరేకంగా సంతకాలను సేకరిస్తున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. కిరణ్ బేడీని రీకాల్ చేయకుంటే పుదుచ్చేరి బంద్ కు పిలుపునిస్తామని నారాయణస్వామి హెచ్చరిస్తున్నారు. దీంతో పుదుచ్చేరిలో సీఎం వర్సెస్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ల మధ్య వార్ మరోసారి ప్రారంభమయింది.

Tags:    

Similar News