రాజీకీయాలకు ఇక రాంరాంనే నట

ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నారాయణ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను రాజకీయాల్లో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పాల్గొనబోనని నారాయణ [more]

Update: 2020-10-20 08:00 GMT

ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన నారాయణ ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై తాను రాజకీయాల్లో ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పాల్గొనబోనని నారాయణ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. మాజీ మంత్రి నారాయణకు ఇంతగా రాజకీయాలపై విరక్తి కలగడానికి రెండు కారణాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

రెండు కారణాలతోనే….

ఒకటి తాను రాజకీయాల్లోకి రాగానే తాను ప్రారంభించిన విద్యా సంస్థలు సక్రమంగా నడవకపోవడం, కొన్ని నష్టాల బాట పట్టడం జరిగాయట. దీంతో పాటు తాను మంత్రిగా నెల్లూరు నగరంలో ఎన్ని అభివృద్ధి పనులు చేసినా ప్రజలు తనను గెలిపించలేదని, అందుకే తనకు రాజకీయాలు వద్దని నారాయణ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఇకపై తాను ఏ పార్టీలో కొనసాగనని కూడా నారాయణ స్పష్టం చేసినట్లు తెలిసింది.

నష్టాల బాటలో….

గతంలో నారాయణ విద్యాసంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా ఉండేవి. అయితే 2014 నుంచి నారాయణ మంత్రిగా ఉండటంతో విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేశారు. దీంతో నారాయణ విద్యాసంస్థలు నష్టాల బాట పట్టాయంటున్నారు. వారి కుటుంబ సభ్యులకు బాధ్యతలను అప్పగించినా సత్ఫలితాలు రాలేదంటున్నారు. దీనికి తోడు తాను టీడీపీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నప్పుడు సంపాదించుకున్న దానికంటే పోగొట్టుకుందే ఎక్కువగా ఉందని నారాయణ ఆవేదన చెందుతున్నారట.

గంటా ఎఫెక్ట్ కూడా…..

ఇప్పుడు నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు తన కుమారుడిని వైసీపీలో చేర్చుతున్నారు. అల్లుడు వైసీపీలో చేరుతుండటంతో తాను టీడీపీలో ఉండటం కూడా కరెక్ట్ కాదని నారాయణ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నారాయణ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఏదైనా అవసరమైతే తప్ప పార్టీ నేతలకు కూడా నారాయణ అందుబాటులో ఉండటం లేదు. మొత్తం మీద నారాయణ ఒక టర్మ్ తోనే రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సి వచ్చిందన్న వ్యాఖ్యానాలు పార్టీ నుంచి విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News