ఈ విషయంలో బాబుకు కష్టాలేనా?

అవును! పార్టీలోనూ, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఇప్పుడు ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌హిళ‌ల‌కు 33% టికెట్లు ఇస్తామని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఇదే సూత్రాన్ని [more]

Update: 2019-01-01 11:00 GMT

అవును! పార్టీలోనూ, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఇప్పుడు ఈ చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌హిళ‌ల‌కు 33% టికెట్లు ఇస్తామని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఇదే సూత్రాన్ని పాటించారు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుషుల‌ను ప‌క్క‌న పెట్టి ఆయ‌న ప్ర‌యోగం చేశారు. బాబు న‌మ్మ‌కం నిజంగానే ప్ర‌జ‌లుకూడా నిల‌బెట్టారు. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌తి జిల్లాలోనూ మ‌హిళ‌లు జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి ? మ‌రో నాలుగు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు మ‌ళ్లీ ఇదే సూత్రాన్ని పాటిస్తారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వారికి ఇదే త‌ర‌హాలోనే సీట్లు కేటాయిస్తారా? లేక ఏదైనా కొత్త ప్ర‌యోగం చేయ‌నున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

విజన్ ను అందుకోలేక…..

దీనికి ప్ర‌ధాన కార‌ణాలు చాలానే క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేశారు. ఈ క్ర‌మం లో ఇలా గెలిచిన మ‌హిళా నేత‌ల‌కు చంద్ర‌బాబు మంత్రులుగా కూడా అవ‌కాశం క‌ల్పించారు. వారికి కీల‌క‌మైన ప‌ద‌వులు కూడా ఇచ్చారు. అయితే, బాబు ఆశీస్సుల‌తో గెలిచిన ఈ నాయ‌కులు చాలా మంది ఆయ‌న విజ‌న్‌ను అందుకోలేక పోయారు. ముఖ్యంగా ప్ర‌జ‌ల్లోనూ మ‌హిళా నేత‌లు ఆశించిన మేర‌కు ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక పోగా .. తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. కొంద‌రు అవినీతి, ఇసుక దందాల్లోనూ వేలు పెట్టారు. ఫ‌లితంగా ఇటు పార్టీ ప‌రువుతో పాటు వ్య‌క్తిగ‌తంగానూ వారు త‌మ ప్ర‌తిష్ట‌ను కూడా దిగ‌జార్చుకున్నారు.

సిట్టింగ్ లుగా ఉన్న వారికి….

ప్ర‌ధానంగా మ‌హిళ‌లు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వారిని అడ్డు పెట్టుకుని వారి భ‌ర్త‌లు పెత్త‌నం చేస్తున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఈ ప‌రిస్థితిపై ఇప్ప‌టికే ప‌లు జిల్లాల నుంచి చంద్ర‌బాబుకు ఫిర్యాదు లపై ఫిర్యాదులు అందాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుతం సిట్టింగులుగా ఉన్న మ‌హిళ‌ల్లో ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగి లిన వారికి టికెట్లు ఇచ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. స‌రే! వీరికి కాకుండా వేరే మ‌హిళా నాయ‌కులు ఎవ‌రైనా ఉన్నారా? అంటే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. పెద్ద‌గా మ‌హిళా నేత‌లు ఎవ‌రూ కూడా టీడీపీలో క‌నిపించ‌డం లేదు. ఉన్న ఒక‌రిద్ద‌రూ కూడా ప‌ద‌వులు లేవ‌నే నిరాశ‌తో నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఏపీలో టీడీపీ బ‌లంగా విశ్వ‌సించే మ‌హిళ‌ల సంఖ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని అంటున్నారు. చంద్ర‌బాబు వ్యూహం మేర‌కు మెజారిటీ యువ‌త‌కు ఛాన్స్ ఇస్తున్న నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌కు ఈ ద‌ఫా గ‌తంలో మాదిరి టికెట్లు ల‌భించే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News