లోకేష్ డిన్నర్ దెబ్బ…వారికి పదవులు ఉండబోవట

వారసులను కొంతకాలం దూరంగా ఉంచాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లోకేష్ విందు సమావేశంతో వారసుల గోల పార్టీలో ఎక్కువగా వినపడుతోంది. కేవలం వారసులనే పిలిచి [more]

Update: 2020-03-14 03:30 GMT

వారసులను కొంతకాలం దూరంగా ఉంచాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల లోకేష్ విందు సమావేశంతో వారసుల గోల పార్టీలో ఎక్కువగా వినపడుతోంది. కేవలం వారసులనే పిలిచి విందు ఇవ్వడమేంటన్న చర్చ జరుగుతోంది. మిగిలిన నేతలు పార్టీ కోసం పనిచేయలేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చివరకు పార్టీ వీడి వెళ్లిపోయే వారు సయితం లోకేష్ విందుపైనే విమర్శలు చేసి వెళుతున్నారు. దీంతో తెలుగుయువత అధ్యక్ష పదవికి వారసులను ఎంపిక చేయకూడదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం.

నాలుగు నెలలుగా….

దేవినేని అవినాష్ మొన్నటి వరకూ తెలుగుయువత అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే టీడీపీ ఓటమి తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ తెలుగు యువత అధ్యక్షుడి నియామకం జరగలేదు. తొలుత తెలుగు యువత అధ్యక్షుడిగా అనేక మంది పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పరిటాల శ్రీరాం, చింతకాయల విజయ్ పాత్రుడు, కరణం వెంకటేష్, హరీష్ మాధుర్, ఆదిరెడ్డి వాసు పేర్లు విన్పించాయి.

అనేక పేర్లు విన్పించినా….

వీరిలో ఎక్కువగా ఆదిరెడ్డి వాసు పేరు విన్పించింది. అయితే అచ్చెన్నాయుడికి కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించడంతో అదే కుటుంబానికి చెందిన వాసు పేరును పక్కన పెట్టినట్లు తెలిసింది. ఇక చింతకాయల విజయ్ పాత్రుడు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జి పదవి కోసం పట్టుబడుతున్నారు. అలాగే కరణం వెంకటేష్ కూడా బాపట్ల పార్లమెంటు ఇన్ ఛార్జి పదవిని కోరుకుంటున్నారు. పరిటాల శ్రీరామ్ ఫోన్ లో కూడా ఎవరికీ అందుబాటులో ఉండరన్న పేరుంది. అందుకే ఆయన పేరును పక్కన పెట్టారు. ఇలా వారసుల పేర్లను బాగానే పరిశీలించిన అధిష్టానం త్వరలోనే తెలుగు యువత అధ్యక్షుడిగా వీరిలో ఒకరిని నియమించాలని నిర్ణయించింది.

వారసులకు ఇవ్వకూడదని….

అయితే లోకేష్ వీరికి విందు ఇచ్చిన తర్వాత పార్టీలో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వారసులకే నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తారా? అన్న చర్చ మొదలయింది. అందుకే వారసుల పేర్లను చంద్రబాబు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఎన్ఎస్ఎఫ్ అధ్కక్షుడిగా ఉన్న నాదెళ్ల బ్రహ్మం చౌదరి పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. కార్కకర్తలకే పార్టీ పదవులను ఇస్తున్నామన్న సంకేతాలను ఇవ్వడానికి వారసులకు తెలుగు యువత అధ్యక్ష పదవి ఇవ్వకూడదని నిర్ణయించారని తెలుస్తోంది.

Tags:    

Similar News