వెనక్కి తగ్గడట.. మరో ఆలోచన లేదట

ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి… ఇది సామెత. అయితే రాజీకీయాలకు ఈ సామెత వర్తిస్తందా? లేదా? అన్నది పక్కన పెడితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా [more]

Update: 2020-07-25 05:00 GMT

ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి… ఇది సామెత. అయితే రాజీకీయాలకు ఈ సామెత వర్తిస్తందా? లేదా? అన్నది పక్కన పెడితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అదే అనుసరిస్తున్నారు. తిరిగి మంగళగిరినే తన కార్యస్థానం చేసుకోవాలని, అక్కడి నుంచే మరోసారి పోటీ చేయాలని నారా లోకేష్ డిసైడ్ అయ్యారన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట. రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉండే మంగళగిరిని వదిలేది లేదని నారా లోకేష్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట.

తొలి ఎన్నికలోనే…..

నారాలోకేష్ ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి దిగింది మొన్నటి ఎన్నికల్లోనే. అంతకు ముందు శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై మంత్రి అయినప్పటికీ తొలిసారి పోటీ చేశారు. అనేక మంది అనేక నియోజకవర్గాలకు లోకేష్ ను ఆహ్వానించినా ఆయన మాత్రం మంగళగిరినే ఎంచుకున్నారు. పెనమలూరు నుంచి పోటీ చేయాలని అక్కడి టీడీపీ నేతలు నారా లోకేష్ ను అభ్యర్థించినా ఆయన వినలేదు. చివరకు మంగళగిరిలో పోటీ చేసి తొలిసారే ఓటమి పాలయ్యారు.

సేఫ్ ప్లేస్ మరొకటి…..

అయితే మంగళగిరి నియోజకవర్గంలో తన ఓటమికి గల కారణాలను నారా లోకేష్ ఎన్నికల ఫలితాల అనంతరం విశ్లేషించుకున్నారు. మరోసారి ఇక్కడ పోటీ చేయాలా? వద్దా? అన్న దానిపై కూడా పలువురితో చర్చించారు. మంగళగిరి కంటే సేఫ్ ప్లేస్ ను చూసుకోవాలని కొందరు నారా లోకేష్ కు సలహాలు కూడా ఇచ్చారు. దీంతో నారా లోకేష్ మరోసారి మంగళగిరిలో పోటీ చేయబోరన్న ప్రచారం గత కొంతకాలంగా జరగుతోంది. అయితే దీనికి నారా లోకేష్ చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.

లేదు ఇక్కడేనట……

మంగళగిరిలోనే మళ్లీ పోటీ చేసి గెలవాలన్నది లోకేష్ గట్టి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గం కీలక నేతలతో లోకేష్ నిత్యం టచ్ లో ఉంటున్నారు. తాను కరోనాతో నియోజకవర్గంలో పర్యటించకపోయినా బాధ్యులను మాత్రం సమస్యల పై స్పందించేందుకు నియమించారు. దీనికి తోడు రాజధాని అమరావతి వ్యవహారం వచ్చే ఎన్నికల్లో కలసి వస్తుందని నారా లోకేష్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే పై ఉన్న వ్యతిరేకత కూడా తనకు సానుకూల పరిణామంగా భావిస్తున్నారు. అందుకే నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారంటున్నారు.

Tags:    

Similar News