మళ్లీ..మళ్లీ.. అవే దెబ్బలా..? తట్టుకునేదెలా?

స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేరు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రజలు రాష్ట్ర పరిస్థితిని చూసి ఓటేస్తారు. స్థానిక సంస్థల [more]

Update: 2021-02-22 03:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేరు. సాధారణ ఎన్నికల సమయంలో ప్రజలు రాష్ట్ర పరిస్థితిని చూసి ఓటేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం అభ్యర్థిని చూసి ఓటేస్తారు. పార్టీ రహితంగా జరుగుతున్న ఎన్నికలే అయినా మద్దతుదారులంటూ అన్ని పార్టీలూ తమ విజయాలను క్లెయిం చేసుకుంటాయి. అందులోనూ తప్పులేదు. కానీ సాధారణ ఎన్నికల్లో పట్టు ఉండాలంటే గ్రామస్థాయిలో బలం ఉండాలి. అందుకే ఏపీలో పంచాయతీ ఎన్నికలు అంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలూ తీసుకున్నాయి.

మంగళగిరి నియోజకవర్గంలో…..

ఇక నారా లోకేష్ ప్రాతినిధ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ నారా లోకేష్ ను ఇక్కడి ప్రజలు ఓడించారు. అయినా రాజధాని అమరావతి అంశం తనకు వచ్చే ఎన్నికల్లో కలసి వస్తుందని నారా లోకేష్ భావిస్తూ వస్తున్నారు. అందుకే మరోసారి మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నారా లోకేష్ రెడీ అవుతున్నారని ప్రచారం కూడా పార్టీలో నడుస్తుంది.

మెజారిటీ స్థానాల్లో….

అయితే ఇటీవల జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో మంగళగిరిలో నారాలోకేష్ కు మళ్లీ దెబ్బపడింది. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని 18 పంచాయతీలకు తొలిదశలో ఎన్నికలు జరగ్గా అందులో 14 చోట్ల వైసీపీ మద్దతుదారులు గెలవడం విశేషం. టీడీపీ కేవలం నాలుగు చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఈ ఫలితాలు నారా లోకేష్ కు వ్యక్తిగతంగా ఎదురుదెబ్బేనని పార్టీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు.

తాను ఇన్ ఛార్జిగా ఉన్నా…..

మంగళగిరికి ఇన్ ఛార్జిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు. తాను ఇన్ ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలోనే అభ్యర్థులను గెలిపించుకోలేక పోతే పార్టీ అగ్రనేత గా మిగిలిన వారిని ఎలా ప్రశ్నిస్తారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అమరావతి రాజధాని ప్రభావం ఉంటుందని భావించి నారా లోకేష్ పంచాయతీ ఎన్నికలను లైట్ గా తీసుకున్నారని, అందుకే ఇటువైపు కూడా తొంగి చూడలేదంటున్నారు. మరోసారి మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయాలనుకుంటే ఆ నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టక తప్పదంటున్నారు. లేకుంటే మరోసారి పాత ఫలితాలే రిపీట్ అయ్యే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News