లోకేష్ సీన్ ఏంటో అర్థమయిందా…?

టీడీపీ భావి వారసుడుగా మూడేళ్ల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయబడిన యువ నేత లోకేష్ కి ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. చంద్రబాబుని సైతం పక్కన [more]

Update: 2020-11-01 06:30 GMT

టీడీపీ భావి వారసుడుగా మూడేళ్ల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయబడిన యువ నేత లోకేష్ కి ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. చంద్రబాబుని సైతం పక్కన పెట్టి ఒకనాడు పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించిన చినబాబు ఇపుడు ఏమీ కాకుండా అయిపోయారు అని అంటున్నారు. దానికి కారణం కూడా ఇండైరెక్ట్ గా చంద్రబాబేనని అంటున్నారు. తాజాగా జరిగిన అచ్చెన్నాయుడు నియామకంలో లోకేష్ ఆశల మీద బాబు బాగానే నీళ్ళు చల్లేశారని అంటున్నారు. దానిని బట్టి చూస్తే 2024లో అన్నీ అనుకూలించి టీడీపీ పవర్ లోకి వచ్చినా చినబాబుకు రాజయోగం లేదని బాబే చెప్పేశారు అంటున్నారు.

బాబు మీద భక్తితో …..

చంద్రబాబు మీద భక్తి, భయం ఇవన్నీ కలసి ఒకనాడు లోకేష్ ని పల్లకీలో పెట్టి తమ్ముళ్లు మోశారు. అవును ఆనాడు అధికారంలో టీడీపీ ఉంది. మరో సారి మనమేనని బాబు ఢంకా భజాయించి మరీ దూసుకుపోయారు. దాంతో టీడీపీలో భావి వారసుడు లోకేష్ అంటే మనసులో ఏమనుకున్నా బయటకు మాత్రం ఓకే అనేశారు. కానీ బాబు రాజకీయ వ్యూహాలే తల్లకిందులైన వేళ 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్నాక టీడీపీలో తమ్ముళ్ళు పూర్తిగా డల్ అయిపొయారు. పక్క చూపులూ చూస్తున్నారు.

నమ్మకం లేదా…?

చంద్రబాబుని రాజకీయ చాణక్యుడు అని కీర్తించిన నోళ్ళే టైం బ్యాడ్ అయితే బాబు అయినా మనమైనా ఒక్కటే అన్న వేదాంతాన్ని వల్లిస్తున్నాయి. చంద్రబాబుకు వయసు మీద పడడంతో పాటు వ్యూహ నైపుణ్యాలు కూడా బెడిసికొట్టడంతో తమ్ముళ్ళు తామున్న పార్టీనే నమ్మలేకపోతున్నారుట. ఇక లోకేష్ వరద బాధితులకు పరామర్శ పేరిట చేస్తున్న జిల్లా టూర్లకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవు అవుతోందిట. బడా నాయకులు అనుకున్న వారే డుమ్మా కొడుతున్నారు. లోకేష్ వస్తే ఏంటి అన్నట్లుగా పసుపు తమ్ముళ్ళు దూరంగా ఉంటున్నారుట.

రుజువు చేసుకోవాలి….

ఇక లోకేష్ పార్టీలో ఇంత తేలిక కావడానికి ఆయన మంగళగిరిలో ఓటమిపాలు కావడమేనని అంటున్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవ‌ని నేత సీనియర్లుగా ఉంటున్న తమ మీద పెత్తనం ఏంటి అన్న లాజిక్ తోనే తమ్ముళ్ళు లైట్ తీసుకుంటున్నారుట. అంతే కాదు, చంద్రబాబుకే లోకేష్ మీద నమ్మకం లేదని, అందుకే బీసీ కార్డు పేరిట అచ్చెన్నాయుడుని తెచ్చి ఏపీ ప్రెసిడెంట్ చేశారని అంటున్నారుట. మొత్తానికి 2024 ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేస్తామని అచ్చెన్నాయుడు వంటి వారు అంటున్నారు తప్ప పొరపాటున కూడా లోకేష్ మా భావి సీఎం అని చెప్పడంలేదు. అంటే లోకేష్ కి సొంత పార్టీలో సీన్ ఏంటో అర్ధమైపోవడంలేదూ.

Tags:    

Similar News