చూసి రమ్మంటే.. కాల్చి వస్తాడనే కాదంటున్నారా?

చంద్రబాబు కు వయసు మీరిపోయింది. వచ్చే ఎన్నికల వరకూ ఆయన పార్టీని నడిపిస్తారనుకోవచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గతంలో మాదిరిగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. కరోనా మహ్మమ్మారి [more]

Update: 2020-10-19 14:30 GMT

చంద్రబాబు కు వయసు మీరిపోయింది. వచ్చే ఎన్నికల వరకూ ఆయన పార్టీని నడిపిస్తారనుకోవచ్చు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గతంలో మాదిరిగా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి. కరోనా మహ్మమ్మారి మరో రెండేళ్లు దేశంలోనే తిష్టవేసి కూర్చుంటుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. చంద్రబాబు జనంలో తిరగకుంటే పార్టీలో జోష్ పెరగదు. పోనీ యువనేత లోకేష్ కు జిల్లాల పర్యటనలను అప్పజెప్పాలన్నా చంద్రబాబు భయపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రతి జిల్లాలో ఒక వర్గం….

లోకేష్ ప్రతి జిల్లాలో తన కంటూ పార్టీలో ఒకవర్గాన్ని ఏర్పరచుకున్నారు. ఎక్కడకు వెళ్లినా ఆయన చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరంగా పార్టీకి మారనున్నాయి. గత ఎన్నికలకు ముందు శాంపిల్ గా లోకేష్ ను జిల్లాల పర్యటన చేసేందుకు అనుమతిచ్చారు. పైగా లోకేష్ మంత్రిగా కూడా ఉండటంతో కొంత ఊపుగానే తిరిగారు. కానీ వివాదాలను పార్టీకి తెచ్చిపెట్టారు. ఇప్పుడు మరోసారి లోకేష్ ను జిల్లాల పర్యటనలకు పంపితే లేనిపోని సమస్యలు తలెత్తతాయని చంద్రబాబు ఆలోచనలో ఉన్నా రంటున్నారు.

ఎన్నికలకు ముందు……

ఎన్నికలకు ముందు లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, బుట్టా రేణుకలకే తిరిగి టిక్కెట్ అని ప్రకటించారు. ఇది పార్టీలో వివాదంగా మారింది. టీజీ వెంకటేశ్ సయితం లోకేష్ మాటలను పట్టించుకోబోనని చెప్పారు. తీరా లోకేష్ ప్రకటించిన ఇద్దరికి టిక్కెట్లు దక్కలేదు. వారిద్దరూ తర్వాత వైసీపీలోకి మారిపోయారు. ఇది పార్టీలో నేటికి చర్చనీయాంశంగానే ఉంది.

చీరాలలోనూ కంపు కంపు…..

అలాగే ప్రకాశం జిల్లా చీరాలోనూ లోకేష్ అప్పట్లో పర్యటించారు. అప్పటి ఎమ్మెల్యే ఆమంచి కృష‌్ణమోహన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గంతో కలసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరకు ఈ ఇద్దరు నేతలు కూడా పార్టీ లో లేరు. చీరాల టిక్కెట్ కూడా చివరి నిమిషంలో చంద్రబాబు కరణం బలరాంకు ఇచ్చారు. ఇలా జిల్లాల పర్యటనలకు వెళితే లోకేష్ కొందరికి అనుకూలంగా ఉంటారన్న టాక్ పార్టీలో వినిపిస్తుంది. అందుకే చంద్రబాబు లోకేష్ జిల్లాల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు.

Tags:    

Similar News