ఇలాగైనా నిరూపించుకోగలిగితే చాలుగా

తెలుగుదేశం పార్టీ క్యాడర్ నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తుందా? ఆయన లీడర్ షిప్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకం ఉందా? ఈ ప్రశ్నలే తెలుగుదేశం [more]

Update: 2020-08-29 06:30 GMT

తెలుగుదేశం పార్టీ క్యాడర్ నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరిస్తుందా? ఆయన లీడర్ షిప్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందన్న నమ్మకం ఉందా? ఈ ప్రశ్నలే తెలుగుదేశం పార్టీలోని యువనాయకులను ఇబ్బంది పెడుతున్నాయి. చంద్రబాబు ఇప్పటి వరకూ పార్టీని తన నాయకత్వంలో నడిపించుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు అనంతరం లోకేష్ పార్టీని ముందుకు నడిపిస్తారా? లేదా? అన్న దానిపై ఎప్పటి నుంచో పార్టీలో చర్చ జరుగుతోంది.

యువనేతలు దూరంగా…..

అయితే ప్రధానంగా సీనియర్ నేతలను పక్కన పెడితే యువనేతల్లోనే లోకేష్ నాయకత్వం పట్ల నమ్మకం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాదిన్నర నుంచి అందరూ సీనియర్ నేతలే కనపడుతున్నారు. యువనేతలు పెద్దగా కన్పించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం నారా లోకేష్ వైపు చూపుతున్నారు. నారా లోకేష్ తాము ఫోన్ చేసినా అందుబాటులోకి రారన్నది యువనేతల ఆరోపణగా ఉంది.

అదే మైనస్ గా మారి…..

అసలే ఎమ్మెల్సీగా ఎన్నికై దొడ్డిదారిన మంత్రి అయ్యారన్న ఆరోపణలు నారా లోకేష్ అయ్యారు. దీంతో పాటుగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇది నారా లోకేష్ కు మరింత మైనస్ అయింది. ముఖ్యంగా యువనేతల్లోనూ, క్యాడర్ లోనూ జోష్ పెంచాలంటే నారా లోకేష్ మరింతగా చొచ్చుకుపోవాల్సి ఉంది. ఇందుకోసం నారా లోకేష్ త్వరలో సైకిల్ యాత్ర ప్రారంభిస్తారని చెబుతున్నారు.

సైకిల్ యాత్ర ద్వారా….

సైకిల్ యాత్రను నారా లోకేష్ దాదాపు 4వేల కిలోమీటర్లు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల ముందు ఈ సైకిల్ యాత్ర ఉంటుందని, అందుకోసం ఇప్పటి నుంచే సైకిల్ యాత్రపై నారా లోకేష్ కిందిస్థాయి నేతల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే నారా లోకేష్ సైకిల్ యాత్ర వల్ల పార్టీకి ఎంత వరకూ ప్రయోజనం అన్నదానిపైన కూడా పార్టీలో చర్చ జరుగుతుందట. సైకిల్ యాత్ర వల్ల క్యాడర్ లో మాత్రం జోష్ నెలకొంటుందని కొందరు వాదిస్తుండగా, సమయం వృధా అని, దానివల్ల మైలేజీ రాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నారా లోకేష్ తనను తాను నాయకుడిగా నిరూపించుకునేందుకు రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News