లోకేష్.. ఏపీ రాహుల్ కాకుండా.. ఇలా చేస్తున్నార‌ట

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు(ఆయ‌నంత‌ట ఆయ‌నే రిజైన్ చేశారు) రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పార్టీ అధ్యక్ష ప‌గ్గాలు తీసుకున్న ఆయ‌న పార్టీని ముందుకు [more]

Update: 2020-06-24 14:30 GMT

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు(ఆయ‌నంత‌ట ఆయ‌నే రిజైన్ చేశారు) రాహుల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పార్టీ అధ్యక్ష ప‌గ్గాలు తీసుకున్న ఆయ‌న పార్టీని ముందుకు న‌డిపించ‌డంలోనూ.. త‌న నాయ‌న‌మ్మ ఇందిరా గాంధీ, త‌న తండ్రి రాజీవ్ గాంధీల వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్నా.. పార్టీలో త‌న‌కంటూ. ప్రత్యేక కేడ‌ర్‌ను, వ్యూహాన్ని ఏర్పాటు చేసుకోలేక పోయారు. దీంతో గ‌త ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని భావించినా.. రాలేక పోయింది. చివ‌ర‌కు గాంధీ ఫ్యామిలీ కంచుకోట అమేథీలో సైతం రాహుల్ స్మృతీ ఇరానీ చేతిలో ఓడిపోయాడు. ఈ నేప‌థ్యంలోనే రాహుల్‌.. అధ్యక్ష ప‌ద‌వి నుంచి స్వతంత్రంగానే వైదొలిగారు. అయితే, రాహుల్ విష‌యంలో జాతీయ మీడియా అతిగా స్పందించింద‌నే విమ‌ర్శలు ఉన్నాయి.

ఎంత కష్టపడినా…..

రాహుల్‌కు ఇంకా రాజ‌కీయాలు ఒంట‌బ‌ట్టలేద‌ని, ఆయ‌న‌కు కాంగ్రెస్ ప‌గ్గాలు ఇవ్వడం స‌రికాద‌ని అప్పట్లో జాతీయ మీడియా పెద్ద ఎత్తున విమ‌ర్శలు చేసింది. ఇది ప్రజ‌ల్లో కి బాగా వెళ్లింది. దీంతో రాహుల్ నాయ‌క‌త్వాన్ని ప్రజ‌లు విశ్వసించ‌లేక పోయారు. నిజానికి రాహుల్ చాలా క‌ష్టప‌డ్డార‌నేది కాంగ్రెస్ నేత‌ల అభిప్రాయం అయినా కూడా ప్రజ‌లు విశ్వసించ‌క పోయేస‌రికి పార్టీ విజ‌యం సాధించలేక పోయింది. అంతెందుకు గుజ‌రాత్‌, క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాహుల్ ఏకంగా నెల‌న్నర రోజుల పాటు ప్రచారం చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు రాకుండా జాగ్రత్త ప‌డుతున్నార‌ట చంద్రబాబు! అంటే, మీడియా ఎక్కడా లోకేష్‌కు వ్యతిరేకంగా క‌థ‌నాలు రాయ‌కుండా ఆయ‌న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

షార్ప్ షూటర్ అంటూ…..

నిజానికి రాహుల్ ఎక్కడ నుంచి ఎన్నిక‌ల్లో పోటీ చేసినా.. ఓట‌మి అనేది ఎరుగ‌రు. కానీ, లోకేష్ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఏడాది ఆయ‌న తొలిసారి మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయ‌న‌పై వ్యతిరేక క‌థ‌నాలు రావ‌డం స‌హ‌జం. త‌న‌ను తానే గెలిపించుకోలేని నాయ‌కుడు రేపు పార్టీ ప‌గ్గాలు అప్పగిస్తే.. ఎలా ? అనే సందేహం వ‌స్తుంది. అయితే, ఇలాంటి సందేహాలు ప్రజ‌ల్లోకి వెళ్తే.. మొత్తానికే మోసం వ‌స్తుంద‌ని గ్రహించిన చంద్రబాబు.. త‌న అనుకూల మీడియాలో లోకేష్ కాలిబ‌ర్‌ను ప్రసంశించేలా .. షార్ప్ షూట‌ర్‌లా ప్రచారం చేయాల‌ని నిర్ణయించారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ…..

ఫ‌లితంగా ఏపీలో లోకేష్‌ను భారీ ఎత్తున ఓ కీల‌క నేత‌గా ప్రచారం చేసేందుకు సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ల వ‌ర‌కు అంద‌రూ శ్రమిస్తున్నారు. దీనికి వేదిక‌గా ప్రస్తుత రాజ‌కీయాల‌ను వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాస‌న మండ‌లిలో తీవ్రస్థాయిలో లోకేష్ కేంద్రంగా రెచ్చిపోతున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో పార్టీలోనూ కీల‌క నిర్ణయాలు, విశ్లేష‌ణ‌లు చేయాల్సి వ‌స్తే.. లోకేష్ కేంద్రంగానే జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. ఇలా మొత్తంగా రాహుల్ ఎక్కడక్కడ ఫెయిల్ అయ్యారో.. అక్కడ‌క్కడ లోకేష్ విఫ‌లం కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది.

అధికారంలో ఉన్నప్పుడు మాత్రం….

అయితే లోకేష్ విష‌యంలో చంద్రబాబు ఇప్పుడు ఏ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారో అవి అధికారంలో ఉన్నప్పుడు తీసుకోలేక‌పోయారు. ఏ మాత్రం అనుభ‌వం లేని లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసిన రెండు రోజుల‌కే మంత్రిని చేశారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు ఓ బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం కూడా వెతికి పెట్టలేక‌పోయారు. ఫైన‌ల్‌గా లోకేష్ ఓడిపోయారు. మ‌రి లోకేష్‌ను లేపేందుకు బాబు వేస్తోన్న ఈ ఎత్తులు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News