చినబాబుకు ఏజీ లేదు… గేజీ లేదంటున్నారే?

రాజకీయమంటే ఒకరు నేర్పితే వచ్చేది కాదు. అలాగని వారసత్వంగా బలవంతంగా తెచ్చుకోలేం. ఈ విషయంలో అనేక ఉదాహరణలున్నాయి. మనరాష్ట్రానికి దాదాపు 9 మంది వరకూ ముఖ్యమంత్రులుగా పనిచేస్తే [more]

Update: 2020-04-07 03:30 GMT

రాజకీయమంటే ఒకరు నేర్పితే వచ్చేది కాదు. అలాగని వారసత్వంగా బలవంతంగా తెచ్చుకోలేం. ఈ విషయంలో అనేక ఉదాహరణలున్నాయి. మనరాష్ట్రానికి దాదాపు 9 మంది వరకూ ముఖ్యమంత్రులుగా పనిచేస్తే వారి కుమారుల్లో రాజకీయంగా ఎదిగింది అతి తక్కువేనని చెప్పాలి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావు, భవనం వెంకట్రామిరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, కె. రోశయ్య వంటి వారు ముఖ్యమంత్రులుగా చేసినా వారి వారసులు మాత్రం ఏ ఒక్కరూ ఆ పదవిని అందుకోలేకపోయారు.

నారా లోకేష్ మాత్రం….

ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ కు మాత్రమే అరుదైన అవకాశం లభించింది. తండ్రి మరణం తర్వాత తాను సొంతంగా పార్టీ పెట్టి జనంలోకి వెళ్లి మరీ గెలిచారు. రెక్కల కష్టంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి అయిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు మాత్రం రాజకీయం పెద్దగా అబ్బలేదనే చెప్పాలి. తండ్రి చాటున రాజకీయం చేద్దామని చూస్తున్న నారా లోకేష్ కు కలిసి రావడం లేదు.

ఎంట్రీయే రాంగ్ స్టెప్….

ఆయన ఎంట్రీయే రాంగ్ స్టెప్ తో పడిందన్నది వాస్తవం. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి మంత్రి కావడం, ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలవ్వడంతో ఆయన నాయకత్వ లక్షణాలపై అనుమానాలు తలెత్తాయి. పార్టీని వీడిపోయే నేతలందరూ నారా లోకేష్ వైపు వేలెత్తి చూపుతున్నారు. అయినా నారా లోకేష్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ట్విట్టర్ కే పరిమితమయ్యారు. అవగాహన లేమితో ట్వీట్లు చేేస్తూ నవ్వుల పాలవుతున్నారు.

ట్వీట్లు.. మీట్లతో….

దాతలు కోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే అరకొర నిధులు విడుదల చేస్తున్నారని నారా లోకేష్ ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో అమరావతి నిర్మాణానికి వసూలు చేసిన నిధులు ఏంచేశాని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇటీవల అమరావతి జేఏసీ కోసం సేకరించిన ఫండ్స్ ఏమయ్యాయి చినబాబూ? అని నెటిజెన్లు నిలదీస్తున్నారు. పార్టీలో ఎవరూ మాట్లాడకపోతుండటంతో ఆయనే ముందుకు వచ్చి ఏదో ఒక విమర్శ చేయాలని అనుకున్నట్లుంది. అయితే లోకేష్ కు ఏజీ లేదు… గేజీ లేదు.. అంటూ సెటైర్లు సోషల్ మీడియాలో పడుతున్నాయి. ఏపీలోని మిగిలిన ముఖ్యమంత్రుల వారసుల జాబితాలో నారా లోకేష్ చేరతారన్న కామెంట్లు పడుతున్నాయి.

Tags:    

Similar News