కాపీ క్యాట్ లా మారిపోతే ఎలా?

జనంలో నిత్యం ఉంటేనే జననేత అవుతారు. ఈ సూత్రాన్ని వైసిపి అధినేత వైఎస్ జగన్ త్రికరణ శుద్ధిగా ఆచరణలో చూపించారు. తండ్రి వైఎస్ మరణం తరువాత జైల్లో [more]

Update: 2021-09-15 00:30 GMT

జనంలో నిత్యం ఉంటేనే జననేత అవుతారు. ఈ సూత్రాన్ని వైసిపి అధినేత వైఎస్ జగన్ త్రికరణ శుద్ధిగా ఆచరణలో చూపించారు. తండ్రి వైఎస్ మరణం తరువాత జైల్లో ఉన్న 16 నెలల్లో తప్ప జగన్ ఎప్పుడు జనంలోనే ఉండేవారు. అలా ఉండటం కోసం ఆయన సుదీర్ఘ ఓదార్పు యాత్ర డిజైన్ చేసుకున్నారు. దాని ఫలితం బాగానే వచ్చినా 2014 ఎన్నికల్లో అధికార పీఠానికి సమీపంగా వచ్చేశారు. ఇక ఆ తరువాత ప్రత్యేక హోదా కోసం పోరాటం, సమస్యలపై దీక్షలు ఆ తరువాత రికార్డ్ స్థాయిలో పాదయాత్ర ను 2019 ఎన్నికల వరకు ప్రజల్లో నిరంతరం ఉండేలా కొనసాగారు. ఆ కష్టం ఊరికే పోలేదు. జగన్ ను అత్యధిక మెజారిటీ తో ఏపీ కి అధినేతను చేసింది. ఇప్పుడు ఆ ఫార్ములానే టిడిపి భావి అధినేత నారా లోకేష్ అనుసరించేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారని తెలుస్తుంది.

అచ్చం నాన్న గెటప్ …

యువకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎలా ఉండేవారో అదే రీతిలో గెడ్డం గెటప్ ను కరోనా టైం లో మార్చేశారు నారా లోకేష్. భారీ బరువును సైతం కష్టపడి డైట్ చేసి స్లిమ్ గా తయారు అయ్యారు. ప్రసంగాల్లో దొర్లుతున్న తప్పులను సవరించుకునేందుకు సైతం గట్టి శిక్షణే తీసుకున్నారు. ఈ మేకోవర్ తో ఇప్పుడు జనం బాట పట్టారు నారా లోకేష్. కరోనా సమయంలో జూమ్ కే టిడిపి పరిమితం అయిందన్న విమర్శలను, ఆరోపణలను పక్కన పెట్టి ప్రజా సమస్యలు ఏవి ఉంటే వాటిపై దుమ్ములేపాలని నారా లోకేష్ డిసైడ్ అయిపోయారు. ఆయన ఎక్కడ కాలు పెట్టినా భూమి ఆకాశం ఏకమైనట్లు ప్రచారం చేసేందుకు పార్టీ అనుకూల మీడియా ను సిద్ధం చేసేసారు. దాంతో ఇప్పుడు చినబాబు మంచి దూకుడు మీద ఉన్నారు. పార్టీ నేతలను పరామర్శించడం, పోలవరం ముంపు బాధితుల సమస్యలు ఇలా ఒకటి కాదు అన్నిటా ఇప్పుడు నారా లోకేష్ దూసుకుపోతున్నారు.

వర్క్ అవుట్ అవుతుందా … ?

ప్రజలు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటారు. కానీ చంద్రబాబు ఎప్పుడు సక్సెస్ ఫార్ములానే పాటిస్తారు. చంద్రబాబు లాగే నారా లోకేష్ ను తయారు చేయడాన్ని ఇప్పుడు ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారన్నది చర్చనీయంగా మారింది. అచ్చం నాన్న లా రూపం మార్చుకున్నంత మాత్రాన చంద్రబాబు మేధస్సు ముందు చినబాబు తేలిపోతారు. పోలికలు అన్నవి పిల్లలకు వచ్చేవే. కానీ చంద్రబాబు పాలనను 14 ఏళ్ళకు పైబడి ఎపి ప్రజలు రుచి చూసేసారు. ఒకరకంగా టిడిపి వారికన్నా బాబు జనానికి ఎక్కువ తెలుసనే చెప్పాలి. అలాంటి పరిస్థితిలో కొత్తగా నారా లోకేష్ రూపం మార్చుకుని ఉంటే ఆయనవైపు ఆకర్షణ మరింత పెరిగేదన్న వాదన కూడా వినవస్తుంది. కాపీ క్యాట్ లా అన్నింటా తండ్రిని గుర్తు చేసేలా కార్యక్రమాల్లో జగన్ రూట్ లో లోకేష్ వెళితే కొత్తేముందన్న భావన వస్తే టిడిపి కి ఆశించిన మైలేజ్ చినబాబు తేలేకపోవొచ్చు. మరి ఇదే రీతిలో నారా లోకేష్ విమర్శకుల నోళ్ళు మూయించేలా దూసుకుపోతారా లేక చతికిల పడతారా ? అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News