లోకేష్ ను తరుముతున్నది జగన్ కాదట

నారా లోకేష్… తెలుగుదేశం పార్టీ భావినేత. ఆయన రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసి ఐదేళ్లు కావస్తున్నా ఆయన నాయకత్వంపై క్యాడర్ లోనూ [more]

Update: 2021-09-05 14:30 GMT

నారా లోకేష్… తెలుగుదేశం పార్టీ భావినేత. ఆయన రాజకీయంగా నిలదొక్కుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసి ఐదేళ్లు కావస్తున్నా ఆయన నాయకత్వంపై క్యాడర్ లోనూ ఇప్పటి వరకూ నమ్మకం కలగలేదు. అందుకు కారణం గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి ఓటమి పాలు కావడమే. అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నెంబర్ 2 గా వ్యవహరించిన నారా లోకేష్ అధికారం కోల్పోయిన తర్వాత తండ్రి స్థానాన్ని సంపాదించుకునేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు.

జగన్ వల్ల సమస్య కాదట…..

నారా లోకేష్ భయం అంతా ఇప్పుడు జగన్ కాదు. జగన్ ఇమేజ్ ఈరోజుే ఉండొచ్చు. రేపు పోవచ్చు. బలమైన క్యాడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి తానే భావినేతను నిరూపించుకోవాల్సిన సమయమిది. జగన్ కు ధీటుగా ఎదగడానికి నారా లోకేష్ కు పెద్దగా ఆటంకాలు లేవనే చెప్పాలి. జగన్ పాలనపై విసుగుచెందిన ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

నాయకత్వ పటిమను…

అయితే అదే సమయంలో తన నాయకత్వ పటిమ ఏంటో చూపించుకోవాలి. నారా లోకేష్ కు జగన్ పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వచ్చిన సమస్య అల్లా జూనియర్ ఎన్టీఆర్. ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలన్న నినాదాలు ఎక్కువయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడటమే నారా లోకేష్ ముందున్న లక్ష్యం. జూనియర్ ఎన్టీఆర్ కంటే తానే అన్ని రకాలుగా సమర్థుడినని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

దృష్టంతా ఆయనపైనే…

అందుకే జగన్ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పైనే దృష్టి పెట్టారు. ఆయన నీడ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే నారా లోకేష్ ఇటీవల బాగా యాక్టివ్ అయ్యారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అటెండ్ అవుతున్నారు. తానున్నానంటూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఇదంతా జగన్ కు వ్యతిరేకంగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారనుకోవడం భ్రమే. ఆయన తపనంతా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుంచి ఫేడ్ అవుట్ చేయడమే. మరి ఈ లక్ష్యంలో నారా లోకేష్ ఏ మేరకు అధిగమిస్తారన్నది వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News