ఓయ్ లోకేష్…ఇక లీడర్ వేనోయ్

నారా లోకేష్. పొట్టి పేరు. నారా చంద్రబాబు నాయుడు మాదిరిగా పొడవాటి పేరు కాదు, అంతేనా తండ్రిలా రాజకీయంగా పెద్ద పేరు కూడా లేరు. అయినా లోకేష్ [more]

Update: 2021-08-17 12:30 GMT

నారా లోకేష్. పొట్టి పేరు. నారా చంద్రబాబు నాయుడు మాదిరిగా పొడవాటి పేరు కాదు, అంతేనా తండ్రిలా రాజకీయంగా పెద్ద పేరు కూడా లేరు. అయినా లోకేష్ వారసుడు, యువకుడు. ఇపుడే పాలిటిక్స్ లో అడుగుపెట్టాడు. అందువల్ల ఇంకా చాలా చేయాలి. అందులో ముఖ్యమైనది ఏదో విధంగా జనాల్లో నానాలి. దానికి బోలెడు షార్ట్ కట్స్ ఉన్నాయి. అర్జంటుగా పోలీసులు అరెస్ట్ చేస్తే కొన్ని గంటలు అయినా స్టేషన్ లో పెడితే ఇక చాలు హైప్ అదే వచ్చేస్తుంది. మిగిలిన పని అంతా అనుకూల మీడియా చూసుకుంటుంది. మొత్తానికి నారా లోకేష్ కల అలా తీరిపోయింది.

ఎట్టకేలకు అలా ….

నారా లోకేష్ గత ఏడాదిగా అరెస్ట్ కావాలని చూస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ని మార్చేశారు. లాంగ్వేజ్ కూడా చేంజ్ చేశారు. డైరెక్ట్ గానే జగన్ ని పట్టుకుని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ లో ఏక వచన ప్రయోగాలు కూడా ఉన్నాయి. దాంతోనే లోకేష్ ఏదోలా అరెస్ట్ కావాలని చూస్తున్నాడని వైసీపీ ఏలికలు గ్రహించారు. కానీ అరెస్ట్ చేయకుండా తమ నిగ్రహాన్ని చాటుకున్నారు. అయితే ఇపుడు మాత్రం చేయకతప్పింది కాదు. గుంటూరుకు చెందిన రమ్య హత్య విషయమై పరామర్శకు వెళ్ళిన లోకేష్ తో పాటు మాజీ మంత్రులు చేసిన హల్ చల్ తో పోలీసులు అందరికీ అరెస్ట్ చేశారు. అలా తొలిసారి చినబాబు అరెస్ట్ అన్న హెడ్డింగ్ మీడియాలో పడేలా చేసుకున్నారు.

ఇక దూకుడేనా …?

రాజకీయ నాయకుడు అన్న తరువాత అభిప్రాయాలను తరచూ మార్చుకోవాలని గిరీశం అంటాడు. కానీ ఆధునాతన రాజకీయాలో అరెస్టులు కూడా కావాలి. ఎన్ని సార్లు అరెస్ట్ అయితే అంత గొప్పగా నాయకుడు అవుతాడు. అలా నారా లోకేష్ అరెస్ట్ కావాలని తెగ ఉబలాటపడినా ఇన్నాళ్ళూ కుదిరింది కాదు, ఇపుడు మాత్రం జగన్ ఆ ముచ్చట తీర్చేశారు. లోకేష్ తో పాటు తండ్రి చంద్రబాబు కోరికను కూడా మన్నించారు. ఆ విధంగా తన కుమారుడు హైలెట్ కావడం పట్ల చంద్రబాబు మనసులో ఆనందించే ఉంటారేమో. బయటకు మాత్రం జగన్ సర్కార్ ని తిట్టిపోస్తున్నారు. ఈ దెబ్బతో నారా లోకేష్ కూడా దూకుడు చేస్తారని టీడీపీ శ్రేణులు గట్టి నమ్మకంగా ఉన్నాయి.

అది కూడా పూర్తి అయితే …?

అయితే ఇక్కడో తకరారు ఉంది. నారా లోకేష్ ఒక్కడూ అరెస్ట్ కాలేదు, పైగా మాజీ మంత్రుల మధ్య గుంపులో గోవిందంలా అయ్యారు. అందువల్ల ఈసారి రెట్టించిన ఊపుతో మరిన్ని ఆందోళనలకు రెడీ అంటారు. ఇక ప్రభుత్వ ఆలోచన కూడా మారవచ్చు. ఎటూ ఒకసారి అరెస్ట్ అన్న ముద్ర పడింది కాబట్టి లోకేష్ ని వేరే కేసుల మీద కూడా అరెస్ట్ చేసి కొన్ని రోజులు అయినా జైలులో ఉంచడానికి రెడీ కావచ్చు. మొత్తానికి ఏపీలో నారా లోకేష్ జగన్ని ఢీ కొట్టేందుకు అరదండాల అండతో అలా తీసుకురావాలను కుంటున్నారు. మరి ఇంతకంటే మించినది కూడా వేరేది లేదు కాబట్టి లోకేష్ లీడర్ అయిపోయినట్లే. ఇక కాచుకోవాల్సింది తమ్ముళ్లా, వైసీపీ నేతలా అన్నది తరువాత తేలే మ్యాటర్.

Tags:    

Similar News