లోకేష్ ఇదేం రాజ‌కీయం … నేత‌ల గ‌గ్గోలు ?

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే వ‌య‌స్సు పై బ‌డింది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో [more]

Update: 2021-06-04 03:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే వ‌య‌స్సు పై బ‌డింది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో యువ‌నేత లోకేషే యాక్టివ్ రోల్ ప్లే చేయాల్సి ఉంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పార్టీని భుజాన‌కెత్తుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు బావుటా ఎగ‌ర‌వేయించ‌డం లోకేష్‌కు శ‌క్తికి మించిన ప‌నే. అందుకోసం చాలా క‌ష్టప‌డాల్సి ఉంది. అయితే లోకేష్ ఎంచుకుంటోన్న మార్గాలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయ‌ని పార్టీ నేత‌లే ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పార్టీ దీన‌స్థితి.. మ‌రో వైపు క‌రోనా కాలంలో ఎవ్వరూ కూడా జ‌నాల్లోకి రావ‌డం లేదు.

సోషల్ మీడియాలోనే…?

మ‌రోవైపు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండా ప‌ట్టే వాళ్లు కూడా లేరు. అయితే లోకేష్ మాత్రం ప్రజ‌ల్లో ప‌లుకుబ‌డి ఉండి ? కేడ‌ర్‌లో ప‌ట్టున్న నేత‌ల కంటే కూడా తూతూ మంత్రంగా ఇద్దరు ముగ్గురుకు సాయం చేసి ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పెట్టుకోవ‌డం లేదా ? పార్టీ రాష్ట్ర కార్యాల‌యానికి పంపించుకునే వారిపైనే ఎక్కువుగా మ‌క్కువ చూపుతున్నార‌ట‌. దీంతో పార్టీలో నిజ‌మైన కేడ‌ర్ ఉన్న ద‌మ్మున్న నేత‌ల ప‌రిస్థితి ఇప్పుడు ల‌బోదిబో మాదిరిగా మారింది. ప్రజ‌ల్లో ప‌ట్టున్న మాస్ లీడ‌ర్లలో చాలా మంది సోష‌ల్ మీడియాను పెద్దగా ప‌ట్టించుకోరు. అవ‌స‌రం ఉంటే వారు మీడియాతో మాట్లాడ‌తారు .. లేదా నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ప‌ని తాము చేసుకుపోతుంటారు.

వారినే అసలైన నేతలుగా…

అయితే లోకేష్ మాత్రం ఇలాంటి నేత‌ల‌ను కాద‌ని… సోష‌ల్ మీడియా టైగ‌ర్లనే అస‌లు సిస‌లైన నేత‌లుగా గుర్తిస్తున్నార‌ట‌. కొద్ది నెల‌ల క్రిత‌మే పార్టీ రాష్ట్ర క‌మిటీని ప్రక‌టించింది. ఇదంతా జంబో క‌మిటీనే. ఇందులో చాలా మంది కొత్త వాళ్లకు, యువ‌కుల‌కు చోటు క‌ల్పించారు. అయితే వీరిలో చాలా మంది ప్రజ‌ల్లోకి వెళ్లకుండా.. తూతు మంత్రంగా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి.. న‌లుగురు నేత‌ల‌ను వెంటేసుకుని.. నాలుగు జెండాలు ప‌ట్టుకుని ఫొటోలుకు పోజులు ఇస్తోన్న ప‌రిస్థితి. పైగా ఈ ఫొటోలు ప్రతి రోజు క్రమం త‌ప్పకుండా పార్టీ రాష్ట్ర కార్యాల‌యానికి కూడా పంపుకుంటున్నార‌ట‌.

అదే పంథాలో వెళితే?

కేవ‌లం ఈ సోష‌ల్ మీడియా ఫీడ్ బ్యాక్ తీసుకుంటోన్న వాళ్లే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నార‌ని.. వారే పార్టీకి భ‌విష్యత్తులో నిజ‌మైన హీరోలు అని న‌మ్ముతున్నార‌ట‌. పార్టీలో కేడ‌ర్ క‌లిగిన నిజ‌మైన నాయ‌కుల‌ను వ‌దిలేసి ఈ సోష‌ల్ మీడియా హీరోల గురించే ఎక్కువ మాట్లాడుతుండ‌డంతో లోకేష్ ప‌ట్ల సీనియ‌ర్లు, కీల‌క నేత‌ల్లో ఆగ్రహావేశాలు, అస‌హ‌నాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా లోకేష్ ఎక్కువుగా చెప్పుడు మాట‌లు చెవికెక్కించుకోవ‌డంతోనే న‌ష్టపోయామ‌ని.. ఇప్పుడు మ‌రోసారి అదే పంథాలో వెళితే పార్టీతో పాటు అంద‌రం మ‌ళ్లీ మున‌గ‌క త‌ప్పద‌ని వారు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News