లోకేష్ పెద్ద గీత ముందు ?

మహా మంత్రి తిమ్మరుసు సమయస్పూర్తి రాజకీయ నాయకులకు ఎపుడూ ఆదర్శమే. ఒకరిని చిన్నగా చూపించాలంటే వారి కంటే మరొకరిని తెచ్చి పెద్దగా చూపిస్తే చాలు. ఆటోమెటిక్ గా [more]

Update: 2021-05-19 13:30 GMT

మహా మంత్రి తిమ్మరుసు సమయస్పూర్తి రాజకీయ నాయకులకు ఎపుడూ ఆదర్శమే. ఒకరిని చిన్నగా చూపించాలంటే వారి కంటే మరొకరిని తెచ్చి పెద్దగా చూపిస్తే చాలు. ఆటోమెటిక్ గా చూసే కళ్లకు మొదటి వారు చిన్నగా కనిపిస్తారు. ఇపుడు తెలుగుదేశం రాజకీయాలలో చినబాబు నారా లోకేష్ బాగా చిన్నగా కనిపిస్తున్నారు. ఇక టీడీపీలో ఎందరో సీనియర్లు కూడా ఉన్నారు. అలాగే ఆరో వేలు లాంటి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఉంది. అందులో కుదురుకున్న అచ్చెన్నాయుడు పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత. పైగా బీసీ నాయకుడు.

అగ్గి రాజేసిన చినబాబు …?

ఇదిలా ఉంటే ఇంటర్, టెన్త్ పరీక్షల మీద ఏపీలో పెద్ద ఎత్తున రాద్ధాంతం జరిగిన సంగతి విదితమే. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా కరోనా వేళ పరీక్షలు ఏంటి అని గర్జించాయి. వాటి కంటే ముందు ఈ విషయాన్ని కదిపి కుదిపి రచ్చ చేసిన వారు నారా లోకేష్. చినబాబు తాపీగా రాసిన ఒక లేఖ ఏపీలో అగ్గిని రాజేసింది. విద్యాశాఖ అధికారులతో జగన్ సమావేశం ఉంటుందని, అందులో పరీక్షల మీద కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అని తెలిసే నారా లోకేష్ లేఖ రాసి పొలిటికల్ మైలేజ్ కి పక్కాగా ప్లాన్ చేశారు. లోకేష్ లేఖతో జగన్ సర్కార్ కూడా మొదట్లో పట్టుదలకు పోయింది. అయితే విపక్షాలు అన్నీ ఏకం కావడంతో పాటు కరోనా కేసులు పెరగడంతో ఎట్టకేలకు పరీక్షలు వాయిదా వేయక తప్పింది కాదు. దీంతో ఈ మొత్తం క్రెడిట్ లోకేష్ ఖాతాలో పడింది.

కావాలనే అలా…?

ఇక పరీక్షల రద్దు విషయంలో నారా లోకేష్ ని ముందుంచి బాబు రాజకీయమాడారని చెబుతారు. పార్టీలో మరో నేత దీని మీద డిమాండ్ చేయకుండా టోటల్ గా లోకేష్ నే ఫోకస్ లో పెట్టారు. దాంతో లోకేష్ జూమ్ యాప్ మీటింగ్ ని పేరేంట్స్ తో పెట్టడం నుంచి సర్కార్ మీద విమర్శల జడివానను ఎప్పటికపుడు కురిపిస్తూ ఒక్కసారిగా పొలిటికల్ జోరు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా ఏపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు కనిపించలేదు. అంటే చినబాబు ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేయడం ద్వారా బహు మొనగాడు అనిపించుకున్నారు అన్న మాట. అలా జగన్ సర్కార్ మీద తొలి విజయం సాధించాడు నారా లోకేష్ అంటూ ఆయన టీమ్ తెగ‌ మురిసిపోతోంది.

ఆ వీడియోకు ఇలా చెక్…?

ఆ మధ్యన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సరిగ్గా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి వస్తుందా అంటూ అచ్చెన్నాయుడు అన్న మాటలతో వీడియో విడుదల అయింది. అది పెను సంచలనం రేకెత్తించింది. దాంతో లోకేష్ కంటే అచ్చెన్నాయుడే టీడీపీలో వెరీ స్ట్రాంగ్ అన్న భావన వెళ్ళిపోయింది. దాని వమ్ము చేసేందుకు,సీనియర్లు సహా మరెవరూ పెదవి విప్పకుండా ఉండేందుకు చినబాబు రాజకీయ కౌశలానికి ఇంటర్ పరీక్షలు పెట్టించారు చంద్రబాబు అన్న మాట. పైగా ఇంతకు ముందు టీడీపీ పెద్దలు ఎన్ని డిమాండ్లు చేసినా వైసీపీ సర్కార్ అసలు పట్టించుకోలేదు, కానీ నారా లోకేష్ డిమాండ్ తో ఏకంగా పరీక్షలు వాయిదా వేశారు, చూశారా చినబాబు సామర్ధ్యం ఇదీ అంటూ గొప్పగా చెప్పుకోవడానికి కూడా దీన్ని వాడుకుంటున్నారుట. మరి దీనితో అచ్చెన్నాయుడు హవాకు కూడా ఇలా చెక్ పెట్టారు అన్నది పసుపు పార్టీలో వినిపిస్తున్నతాజా మాట. వ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News