అంత లైట్ గా తీసుకుంటున్నారా…?

ఏపీ ప్రధాన విప‌క్షం టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీలో రెండో ప్లేస్‌లో ఉన్నప్పటికీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్‌ను ఎవ‌రూ కూడా లెక్క [more]

Update: 2019-08-12 13:30 GMT

ఏపీ ప్రధాన విప‌క్షం టీడీపీలో చిత్రమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీలో రెండో ప్లేస్‌లో ఉన్నప్పటికీ.. పార్టీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్‌ను ఎవ‌రూ కూడా లెక్క చేయ‌డం లేదు. పార్టీని న‌డిపిచ‌డంలోనూ 2014లో పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డంలోనూ లోకేష్ పాత్రను త‌క్కువ‌గా చూప‌లేం. ఆయ‌న త‌న‌కున్న అపార డిజిట‌ల్ ప‌రిజ్ఞానంతో పార్టీకి ఎన‌లేని సేవ‌లు అందించారు. అప్పటి వ‌రకు పార్టీ ప్రచారానికి ఉన్న మూస విధానాన్ని ప‌క్కన పెట్టి పెద్ద పెద్ద డైరెక్టర్లను రంగంలోకి దింపి ప్రజ‌ల‌ను ఆక‌ట్టుకునేలా ప్రక‌ట‌నలు రూపొందించి ప్రసారం చేయించారు. అదే స‌మ‌యంలో పార్టీ స‌భ్యత్వాల‌ను ఆన్‌లైన్ చేసి సంఖ్యను పెంచారు.

బెల్లం చుట్టూ ఈగల్లా….

ఇవి పార్టీకి 2014లో అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో తోడ్పడ్డాయి. బ‌హుశ ఈ కృషిని గుర్తించే ఆయ‌న తండ్రి , అప్పటి సీఎం చంద్రబాబు 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గం విస్తర‌ణ‌లో ఆయ‌న మంత్రిగా అవ‌కాశం ఇచ్చా రు. అప్పటి త‌ర్వాత కూడా మంత్రివ‌ర్గంలోనూ నెంబ‌ర్ టూ పొజిష‌న్‌లోనే లోకేష్ ఉన్నారు. దీంతో అంద‌రూ బెల్లం చుట్టూ ఈగ‌లు చేరిన‌ట్టు త‌మ త‌మ ప‌నుల కోసం ప‌ద‌వుల కోసం ఆయ‌న చుట్టూ తిరిగారు. ఆయ‌న స‌ల‌హాలు, సిఫార్సుల కోసం క్యూ క‌ట్టారు. ఇలా ఉన్న లోకేష్ ప్రభ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మి పాల‌వ‌డంతో ఒక్కసారిగా కిందికి జారింది. అంతేకాదు, ఆయ‌నతొలి సారి పోటీ చేసిన మంగ‌ళ‌గిరిలోనూ ఓడిపోవడం మైన‌స్‌గా మారింది.

సీనియర్ నాయకుల డుమ్మా….

దీంతో ఇప్పుడు పార్టీలో ఆయ‌న‌ను గుర్తించేవారు గౌర‌వించేవారు కూడా క‌నిపించ‌డం లేదు. సీనియ‌ర్లు కూడా ఇప్పుడు లోకేష్‌ను ప‌క్కన పెడుతున్నారు. ఇటీవ‌ల గోదావ‌రి వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాలో ఒక‌రోజు ప‌ర్యట‌న పెట్టుకుని అక్క‌డి కి వెళ్లారు లోకేష్‌. పాల‌కొల్లు, న‌ర‌సాపురం స‌హా తూర్పులోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటించి వ‌ర‌ద బాధితుల త‌రఫున ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమ‌య్యారు. అయితే, ఈ కార్యక్రమాల‌కు కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు డుమ్మా కొట్టారు.

చూడటం లేదు…..

నిజానికి వారు ఆయా జిల్లాల్లోనే ఉన్నా.. లోకేష్ వ‌స్తున్న స‌మ‌చారం తెలుసుకున్నా ఒక్క అడుగు కూడా బ‌య‌ట‌కు పెట్టలేదు. దీంతో లోకేష్ ప్రభ దిగ‌జారింద‌నే విష‌యం పార్టీలో చ‌ర్చకు వ‌చ్చింది. ప‌శ్చిమ‌లో పాల‌కొల్లులో ప‌ర్యటించిన లోకేష్‌ను స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాత్రమే ప‌ట్టించుకున్నారు. ఇక న‌ర‌సాపురం ప‌ర్యట‌న‌లో మాజీ ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడు మాత్రమే ఉన్నారు. ఇక తూర్పు ప‌ర్యట‌న‌లో కూడా చిన‌రాజ‌ప్ప మిన‌హా, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు లాంటి వాళ్లు అస‌లు లోకేష్ వైపు చూడ‌లేదు.

తెలిసి తెలియని…..

అదే స‌మ‌యంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు త‌న కుటుంబంపై జ‌గ‌న్ ప్రభుత్వం కేసులు పెట్టడంతో ర‌గిలిపోతున్నారు. ఈ క్రమంలో విష‌యాన్ని లోకేష్ దృష్టికి తీసుకు వెళ్లాల‌ని ఆయ‌న అనుచరులు స‌ల‌హా ఇవ్వగా.. ఆయ‌న ద‌గ్గర‌కి వెళ్తే.. తెలిసీ తెలియ‌ని ప‌రిజ్ఞానంతో స‌మ‌స్యను మ‌రింత పెద్దది చేస్తారు.. అని ఆయ‌న అన‌డం మ‌రింత‌గా చ‌ర్చకు వ‌స్తోంది. ఏదేమైనా.. చంద్రబాబు త‌ర్వాత చిన్నబాబు అని ప్రచారం చేసిన వారే ఇప్పుడు ఇలా చేయ‌డంతో పార్టీ ప‌రిస్థితిపై ప్రశ్నలు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News