చినబాబు పెద్ద సవాల్ ?

ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు ఎక్కడా సౌండే లేదు. ఇక పెదబాబు, చినబాబుల పరిస్థితి అయితే మహా [more]

Update: 2019-06-28 08:30 GMT

ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు ఎక్కడా సౌండే లేదు. ఇక పెదబాబు, చినబాబుల పరిస్థితి అయితే మహా దారుణం. మాదే మళ్ళీ అధికారం అంటూ జబ్బలు చరచిన తండ్రీ కొడుకులు ఎక్కడా అయిపూ అజా లేకుండా పోయారు. ఏడాది పాటు మౌనంగా ఉందామని, జగన్ పాలన చూసిన తరువాతనే నోరు విప్పుదామని మొదట్లో అనుకున్నా తమ్ముళ్ళకు మాత్రం మైక్ సరదా పోలేదు. అందుకే అక్కడక్కడ జగన్ని విమర్శిస్తూ మేమూ ఉన్నామనిపించుకుంటున్నారు. ఇక నారా లోకేష్ అయితే ట్విట్టర్ కి మళ్ళీ పదును పెడుతున్నారు. జగన్ పై అక్కడ కామెంట్స్ చేస్తూ నేనే లీడర్ అంటున్నారు.

పెద్ద సవాలే మరి :

ఇదిలా ఉండగా జగన్ని సవాల్ చేసేందుకు చినబాబు రెడీ అయిపోవడమే విచిత్రం. గత ప్రభుత్వ విధానాలపైన మంత్రి వర్గ ఉప సంఘంతో విచారణకు జగన్ ఆదేశైంచడంతో టీడీపీ నేతలకు కాళ్ళూ చేతులు ఆడడంలేదు. ఈ టైంలో ట్విట్టర్లో దూసుకొచ్చిన నారా లోకేష్ , ఎన్ని విచారణలు అయినా జరిపించుకోండి, మా తండ్రి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అసలు అవినీతి మచ్చ లేని ఏకైక నాయకుడు చంద్రబాబు అంటూ గట్టిగా సవాల్ చేశారు. మీ విచారణలకు ఎవరూ జడిసిపోరని, తాము నీతిమంతులం అంటూ గట్టిగా చెప్పుకున్నారు. వైఎస్సార్ టైంలో 26 విచారణ కమిటీలను వేసినా కూడా ఎక్కడా అవినీతి అన్నది రుజువు చేయలేకపోయారని, తండ్రీ కొడుకుల పాలనలో ఎంత వేధించినా చంద్రబాబుకు ఏమీ కాదని కూడా ధీమా వ్యక్తం చేశారు.

ఢీ కొడతారా :

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. టీడీపీలో ఆయన్ని ఎదిరించే పెద్ద నాయకుడు ఎవరూ ఇప్పటికైతే కనిపించడంలేదు. అసెంబ్లీలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సౌండ్ చేస్తున్నా బయట వేదికల మీద మాత్రం అలాంటి నాయకులు ఎవరూ లేరు. దాంతో నారా లోకేష్ బాబే రంగంలోకి దిగి జగన్ని ఢీ కొట్టాలనుకుంటున్నారట. జగన్ కి తానే సరిజోడు అని భావిస్తున్న చినబాబు గత కొన్ని రోజులుగా ట్విట్టరి కి మళ్ళీ పని చెబుతున్నారు. జగన్ని ఎంతగా విమర్శిస్తే అంతలా జనం ఫోకస్ తన మీద పడుతుందని, తాను జగన్ స్థాయి నేతను అని అలా లోకానికి తెలుస్తుందని చినబాబు మాస్టర్ ప్లాన్ వేసినట్లున్నారు. అయితే ట్విట్టర్ లో యుధ్ధం ఎంత చేసినా మాస్ కి అది చేరదని, ప్రజా క్షేత్రంలోనే లోకేష్ తన సత్తా చాటుకోవాలని తమ్ముళ్ళే సలహలు ఇస్తూండడం విశేషం.

Tags:    

Similar News