ట్విట్టర్ లో చినబాబు చెలరేగుతున్నారే ?

ట్విట్టర్ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో కొందరి పేర్లు ప్రముఖంగా వినపడతాయి. వారిలో ముఖ్యమంత్రుల కుమారులు నారా లోకేష్, కెటిఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా [more]

Update: 2019-06-30 02:30 GMT

ట్విట్టర్ పేరు చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో కొందరి పేర్లు ప్రముఖంగా వినపడతాయి. వారిలో ముఖ్యమంత్రుల కుమారులు నారా లోకేష్, కెటిఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వైసిపి ప్రభుత్వ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి. వీరి ట్వీట్లతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిపోతుంది. అయితే ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాకా నారా లోకేష్ ట్విట్టర్ కొంతకాలంగా మూగబోయింది. ఎన్నికల్లో టిడిపి ఘోరపరాభవంతో మైండ్ బ్లాంక్ అయిపోయిన చినబాబు కొంతకాలం సోషల్ మీడియా వ్యవహారాలకు దూరం జరిగి తాజాగా మరోసారి ట్విట్టర్ తెరమీద ప్రత్యక్షమై పోరాటం మొదలు పెట్టేశారు.

ఇవిగో వైసిపి అక్రమాలు …

నెల్లూరు రూరల్ ఎమ్యెల్యే శ్రీధర్ ఒక జర్నలిస్ట్ ను ఫోన్ లో బెదిరించిన సంభాషణ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి కలకలం రేపారు చంద్రబాబు తనయుడు. జర్నలిస్ట్ లకే వైసిపి ప్రభుత్వంలో రక్షణ లేనప్పుడు సామాన్యులకు ఏమి ఉంటుందని సర్కార్ కు చురకలు అంటించారు నారా లోకేష్. మరోపక్క విజయసాయిరెడ్డి ట్వీట్ లపైనా విరుచుకుపడ్డారు. ప్రజావేదిక కూల్చివేతపైనా మండిపడ్డారు. దార్శకనేత చంద్రబాబు అంటూ తండ్రిపై పొగడ్తలు కురిపిస్తూ మహామేత తనయుడు జగన్ అంటూ సెటైర్లు విసిరారు.

మళ్ళీ లైమ్ లైట్ కోసమే ….

నారా లోకేష్ ఇలా సడెన్ గా దాడి మొదలు పెట్టడం వెనుక జగన్ కి తానె సరైన ప్రత్యర్థి గా నిరూపించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అయ్యింది. ఒక పక్క వైసిపి నేత విజయసాయి రెడ్డి దూసుకుపోతూ ఉండటంతో ఆయనకు కౌంటర్ లోకేష్ అయితేనే సరి అని భావించి చంద్రబాబు చినబాబును రంగంలోకి దింపారు అని పసుపు శ్రేణుల సమాచారం. అయితే ఇప్పటికే చినబాబుపై పార్టీ శ్రేణులు బయటపడకున్నా లోలోపల మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నా చంద్రబాబు మాత్రం పుత్రోత్సహాన్ని కొనసాగిస్తూ ఉండటం విశేషం.

Tags:    

Similar News