పుత్రోత్సాహానికి ఫుల్ స్టాప్….!!!

లోకేష్ కు ఇప్పట్లో అవకాశం లేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ప్రాధాన్యతను పార్టీలో తగ్గించాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కు [more]

Update: 2019-07-02 05:00 GMT

లోకేష్ కు ఇప్పట్లో అవకాశం లేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ ప్రాధాన్యతను పార్టీలో తగ్గించాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కు రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం, కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లనే పార్టీ ఓటమి పాలయిందని కొందరు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే లోకేష్ హవా మామూలుగా ఉండేది కాదు. ఓటమి పాలు కావడంతో ఎక్కువ మంది నేతలు లోకేష్ ను టార్గెట్ చేయడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది.

తనయుడితో ఇబ్బందులే….

నారాలోకేష్ తండ్రి రాజకీయ వారసత్వంతో వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన పార్టీని వెనక ఉండి నడిపించేవారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలని తలచారు. చంద్రబాబునాయుడు రెండేళ్ల పాటు లోకేష్ ను వారించినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వత్తిడి రావడంతో లోకేష్ ను ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేశారు. తద్వారా లోకేష్ తో పాటు చంద్రబాబునాయుడు కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సి వచ్చింది.

ఇమేజ్….చరిష్మా లేక…

దీంతో పాటు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పెద్దగా జనంలోకి చొచ్చుకుపోయింది లేదు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారి చంద్రబాబునాయుడికి కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టారు. ఎన్నికలకు ముందే కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పేర్లను లోకేష్ ప్రకటించడం కూడా వివాదాస్పదమయింది. దీంతో పాటు లోకేష్ చుట్టూ ఉన్న కోటరీ దెబ్బకు సీనియర్ నేతలు సయితం ఇబ్బందులు పడ్డారు. లోకేష్ పార్టీ కార్యాలయంలో ఉంటే వెళ్లేందుకు కూడా సీనియర్ నేతలు జంకారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా ఎన్నికల్లో నారాలోకేష్ ఓటమి పాలు కావడం పై కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పక్కన పెట్టాలని….

ఈ నేపథ్యంలో నారా లోకేష్ ను పార్టీలో క్రియాశీలకంగా ఉండేలా చూడాలని కొందరు నేతలు చంద్రబాబును కోరుతున్నారు. నారా లోకేష్ కోటరీపై కూడా కొందరు ఫిర్యాదు చేశారు. నిన్న చంద్రబాబునాయుడుతో సమావేశమైన కాపునేతల్లో కొందరు లోకేష్, ఆయన కోటరీపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబునాయుడు ఇకపై పార్టీని తానే చూసుకుంటానని, నేరుగా తనతో మాట్లాడవచ్చని చంద్రబాబు వారికి సూచించినట్లు తెలిసింది. ఇలా నారా లోకేష్ పార్టీలో ప్రమేయాన్ని వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబు తగ్గించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి చినబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News