ఇన్నాళ్లకు గుర్తొచ్చామా బాబూ..?

ఏపీ మాజీ సీఎం రాజకీయ అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ సీఎం , వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఫాలో అవుతున్నారు. [more]

Update: 2019-11-10 11:00 GMT

ఏపీ మాజీ సీఎం రాజకీయ అప‌ర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు ఏపీ సీఎం , వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఫాలో అవుతున్నారు. అదేంటి? అనుకుంటున్నా రా? ఓట‌మి ఎఫెక్ట్‌. అంతే మ‌రి.. ఒక ఒట‌మి అనేక పాఠాలు నేర్పుతుంద‌ని అన్న‌ట్టుగా చంద్ర బాబుకు ఇప్పుడు అనేక పాఠాలు నేర్పుతున్నాయి. ఓట‌మి నుంచి మ‌ళ్లీ పార్టీని నిల‌బెట్టుకునే దిశ‌గా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు, కార్మికుల‌కు, రైతుల‌కు కూడా చంద్ర‌బాబు పార్టీలో ప్రాధాన్యం పెంచుతున్నారు. ఆయా వ‌ర్గాల‌కు అనుబంధ సంఘాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ఐదేళ్ల పాటు….

నిజానికి గ‌తంలో టీడీపీలో మ‌హిళా విభాగం బలంగా ఉండేది. తెలుగు మహిళ విభాగంలో న‌న్నప‌నేని రాజ‌కుమారి, రోజా వంటి వారు కీల‌క నాయ‌కులుగా ఉండి అధికార ప‌క్షంపై విమ‌ర్శ లు గుప్పించేవారు. అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, కార్మికుల సంఘాలు కూడా ఉండేవి. అయితే, గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఈ సంఘాల‌పై చంద్రబాబు అశ్రద్ద చూపించారు. వీటిని పెద్దగా ప‌ట్టించు కోలేదు. దీంతో ఆయా సంఘాలు మూల‌న‌ప‌డ్డాయి. అయితే, అదే స‌మ‌యంలో పార్టీలోని కొంద‌రు సీబీఎన్ ఆర్మీ కొత్త సంఘాన్ని తెర‌మీదికి తెచ్చారు. అయితే, ఇది కేవ‌లం పార్టీ మ‌హానాడుల వ‌ర‌కే ప‌రిమిత‌మైంది.

సీబీఎన్ ఆర్మీతో…..

చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ సీబీఎన్ ఆర్మీ హడావిడే ఎక్కువుగా క‌నిపించేది. దీంతో చంద్రబాబు తెలుగు యువ‌త‌, టీఎన్ఎస్ఎఫ్‌, తెలుగునాడు సాంకేతిక నిపుణుల విభాగం, తెలుగు మహిళా విభాగం లాంటి కీల‌క విభాగాల‌ను ప‌క్కన పెట్టేశారు. దీంతో పార్టీ కోసం ఎప్పటి నుంచో క‌ష్టప‌డుతున్న తమ‌ను కాద‌ని.. ఈ సీబీఎన్ ఆర్మీని ఎంక‌రేజ్ చేస్తుండ‌డంతో అనుబంధ సంఘాల వారు చాలా మంది నిరాశగా మారిపోయారు. కానీ, వైసీపీలో అలా కాదు.. ప్రతి విష‌యాన్నీ కూలంక‌షంగా గ‌మ‌నించి.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేసుకున్నారు.

జగన్ ఫార్ములానే…

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రైన బూత్ లెవ‌ల్ క‌న్వీన‌ర్లు లేక పోల్ మేనేజ్‌మెంట్‌లో వెన‌క‌ప‌డింది. గ‌త ఐదేళ్లలో జ‌గ‌న్ పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కు బ‌లోపేతంగా మార్చారు. ఈ ఫార్ములాతోనే వైసీపీని జ‌గ‌న్ అధికారంలోకి తీసుకురాగ‌లిగార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు న‌మ్ముతున్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను చంద్రబాబు అమ‌లు చేయాల‌ని నిర్ణయించుకుని, ఆదిశ‌గా ముందుకు సాగుతున్నారు. జగన్ మాదిరిగానే పార్టీలో యువతకు, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేస్తె.. వచ్చే ఎన్నికల నాటికీ మళ్ళీ బలపడోచ్చు అనే ఆలోచన వచ్చింది.

యువరక్తాన్ని నింపాలని….

ఈ క్రమంలోనే రాష్ట్రంలో టీడీపీని శ‌క్తిమంతం చేసేందుకు చంద్రబాబు త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగాల‌ని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు జిల్లాల వారీగా స‌మీక్షా స‌మావేశాలు పెడుతూ పార్టీలో యువ‌ర‌క్తాన్ని, అనుబంధ సంఘాల‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఇప్పుడు పాత క‌మిటీల‌ను పునుద్ధరించ‌డ‌మా ? లేదా ? ఆ క‌మిటీల్లో యువ‌త‌కు, కొత్త వారికి చోటు కల్పించ‌డ‌మా ? అన్న ఆల‌ోచ‌న‌లో ఉన్నారు.

Tags:    

Similar News