కొత్త ఊపు తెచ్చేందుకు కొత్త బాణం వదులుతున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఇపుడు మూడవతరంపైన చర్చ సాగుతోంది. అక్కడ కనుక సరైన పరిష్కారం లభిస్తే మాత్రం పార్టీ మరింతకాలం మనగలుగుతుంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు ఇంతదాకా [more]

Update: 2020-03-02 08:00 GMT

తెలుగుదేశం పార్టీలో ఇపుడు మూడవతరంపైన చర్చ సాగుతోంది. అక్కడ కనుక సరైన పరిష్కారం లభిస్తే మాత్రం పార్టీ మరింతకాలం మనగలుగుతుంది. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు ఇంతదాకా తీసుకువచ్చారు. తనకు మరో ఇరవయ్యేళ్ళ వరకూ నాయకత్వం వహించే ఓపిక ఉందని చంద్రబాబు చెప్పుకుంటున్నా నవీనతరం ఓటర్లకు ఆయన కనెక్ట్ కాలేకపోతున్నారన్నది వాస్తవం. బాబువి ఔట్ డేటెడ్ పాలిటిక్స్ అని ప్రత్యర్ధులు అనడమే కాదు, ఇపుడు సొంత పార్టీలోనూ చర్చ సాగుతోంది.

ఆయన వల్ల కాదా….?

ఈ నేపధ్యంలో పార్టీలోని మూడోతరం ప్రతినిధిగా నారా లోకేష్ జనం ముందుకు వచ్చాడు. అయితే ఆయన రాజకీయ అరంగేట్రమే పెద్ద మైనస్ అయింది. దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయిన లోకేష్ అనుభవం లేకపోయినా మూడు ప్రధాన మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు. ఇక పార్టీలో కూడా కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ నంబర్ టు తానేనని చెప్పుకున్నారు. అన్నీ బాగానే ఉన్నా సమర్ధత మీద సొంత పార్టీలోనే అనుమానాలు ఉండడం, దానికి తోడు లోకేష్ సైతం తండ్రి మాదిరిగా నాయకత్వ లక్షణాలు సంతరించుకోకపోవడంతోనే నిన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.

గట్టిగా ఉంటే….?

ఇపుడు లోకేష్ మీద చంద్రబాబుకే పెద్దగా ఆశలు, భ్రమలూ లేవని అంటున్నారు. ఈ క్రమంలో లోకేష్ సతీమణి, నందమూరి వారు రక్తం అయిన బ్రాహ్మణి కనుక రంగప్రవేశం చేస్తే పార్టీకి ఊపు వస్తుందని చాలాకాలంగా వస్తున్న డిమాండే. దానికి నాంది అన్నట్లుగా తన భర్త లోకేష్ తో కలసి బ్రాహ్మణి టీడీపీ సోషల్ మీడియా విభాగం ముఖ్య కార్యకర్తల‌తో తాజాగా ఆత్మీయ విందులో పాలుపంచుకోవడం సంచలమైంది. టీడీపీ ఇపుడు మెయిన్ స్ట్రీం మీడియాతో పాటుగా సోషల్ మీడియాను గట్టిగా చేసుకుని ముందుకు సాగుతోంది. ప్రభుత వైఫల్యాలను మరింత ఎక్కువగా జనంలోకి తీసుకుపోయేందుకు అవసరమైన సలహా సూచనలు బ్రాహ్మణి ఇచ్చారని అంటున్నారు.

వస్తున్నారా ..?

ఇక ఈ సమావేశంలోనే తాను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా బ్రాహ్మణి బలమైన సంకేతాలు ఇచ్చేశారని పచ్చ పార్టీలో టాక్ నడుస్తోంది. అవసర‌మైన సమయంలో తాను పార్టీకి సేవలు అందిస్తామని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే కనుక నిజం అయితే టీడీపీ జాతకం అమాంతం మారకపోయినా కొత్త ఊపు రావడం ఖాయమని అంటున్నారు. బ్రాహ్మణి ఎటూ నందమూరి వారి ఆడపడుచు కాబట్టి ఆమె పట్ల జనంలో కొంత సానుకూలత ఉంటుంది. ఆమె కనుక తన నాయకత్వ లక్షణాలను మెరుగుపరచుకుంటే మూడవతరంలో లీడర్ సమస్య కొంత వరకైనా తీరినట్లేనని అంటున్నారు. మరి జగన్న బాణంగా షర్మిల రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన మీదకు దూసుకొచ్చే బాణంలా బ్రాహ్మణి చెలరేగిపోతారా అన్నది చూడాలి.

Tags:    

Similar News