నిజమైన మార్పు వచ్చిందా?

అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్రబాబు వ‌య‌సు గురించి స‌భ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. వైసీపీ నాయ‌కుడు, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. మాట్లాడుతూ.. “చంద్రబాబులో చాలా మార్పు క‌నిపిస్తోంది. [more]

Update: 2019-12-13 06:30 GMT

అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్రబాబు వ‌య‌సు గురించి స‌భ‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. వైసీపీ నాయ‌కుడు, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు.. మాట్లాడుతూ.. “చంద్రబాబులో చాలా మార్పు క‌నిపిస్తోంది. ఆయ‌న‌లో వ‌య‌సు పైబ‌డిన ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి“ అంటూ గేలిచేసే ప్రయ‌త్నం చేశారు అయితే దీనికి చంద్రబాబు తాను వ‌య‌సు పైబ‌డినా 25 ఏళ్ల వ‌య‌సులో ఉన్నవారితో స‌మానంగా ఆలోచ‌న‌లు చేస్తాన‌ని చెప్పుకొని క‌వ‌ర్ చేసుకునే ప్రయ‌త్నం చేశారు. కానీ, ప‌రిశీల‌కులు మాత్రం తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్రబాబులో ఏదో తేడా కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదే….

కొన్నాళ్ల కింద‌ట చంద్రబాబుకు ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత చంద్రబాబుకు చాలా మార్పు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఆయ‌న మాట‌ల విష‌యంలోనే త‌న మార్పును చూపించేస్తున్నారు. ప్రతి విష‌యంలోనూ యూట‌ర్న్ తీసుకుని యూట‌ర్న్ అంకుల్ పేరును స్థిరం చేసుకున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో పార్టీపైనా ఆయ‌న ప‌ట్టుత‌ప్పుతున్నార‌ని అంటున్నారు. ఇప్పటి వ‌ర‌కు చాలా మంది గెలిచిన ఎమ్మెల్యేల‌ను ఆయ‌న త‌న‌వైపు తిప్పుకోలేక పోయారు. అదే స‌మ‌యంలో ప‌దేప‌దే ఆయ‌న హెచ్చరిస్తున్నా ఎమ్మెల్యేలు ఖాత‌రు చేయ‌డం లేదు. అలాంటి వారిని ఆయ‌న చూసీ చూడ‌నట్టే… వినీ విన‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

పవన్ ను వెనకేసుకొచ్చి….

చివ‌ర‌కు తాను రాజ‌కీయంగా లైఫ్ ఇచ్చిన కొడాలి నాని అయినా వ‌ల్లభ‌నేని వంశీ లాంటి వాళ్లు కూడా చంద్రబాబుపై చెప్పలేని.. రాయ‌లేని మాట‌ల‌తో విరుచుకు ప‌డుతున్నారు. చంద్రబాబుకు ఈ స్థితి ఎందుకు వ‌చ్చింది ? అన్నది ఆయ‌నే ఆలోచ‌న చేసుకోవాలి. ఇక‌, ప్రసంగాల విష‌యంలోనూ మాట‌లు తూలుతున్నారు. స‌వాళ్లకు సిద్ధమ‌వుతున్నారు. గ‌తంలో ఆయ‌న స‌వాళ్లు అనే స‌రికి కొంత జంకే వారు. కానీ, ఇప్పుడు ఆయ‌నే స‌వాళ్లు రువ్వుతున్నారు. ఇక‌, బీజేపీ, జ‌న‌సేన విష‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయ‌న ఇప్పుడు వారిని దువ్వే కార్యక్రమాన్ని దాచుకోలేక పోతున్నారు. స‌భ‌లో జ‌గ‌న్ త‌న‌కు ఒక్కతే భార్య అని చెప్పడాన్ని చంద్రబాబు త‌ప్పు ప‌ట్టడ‌మే కాకుండా ప‌వ‌న్‌ను స‌భ‌లో అవ‌మానిస్తారా? అంటూ.. లేని పోని బాధ్యత‌ను భుజాన వేసుకున్నారు.

తేడా వచ్చినట్లుందని….

అదే స‌మ‌యంలో బీజేపీకి ద‌గ్గర‌వుతున్నారు. అమెరికాలోని బిల్ గేట్స్‌కు కూడా తానే మార్గద‌ర్శిన‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్ ఇలా ఉందంటే అది త‌న ఘ‌న‌తేన‌ని చంద్రబాబే చెప్పుకోవ‌డం ఇలాంటి ప‌రిణామాల‌ను చూస్తున్న వారికి చంద్రబాబు వ‌య‌సు రీత్యానో.. లేక పార్టీ ఓట‌మి రీత్యానో .. ఏదో తేడా ఖ‌చ్చితంగా క‌నిపిస్తోంద‌ని అంటుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని బ‌ట్టి అంబ‌టి విశ్లేష‌ణ క‌రెక్టేనా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News