అమరావతి చంద్రబాబుదే

మళ్ళీ అమరావతి కళకళలాడుతోంది. ఎక్కడా అంటే సవరించిన ఇండియా మ్యాపులో, తమ్ముళ్ళే మెదళ్ళలో. అలాగే అనుకూల మీడియాలో. మొత్తానికి జగమొండి అయిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండగానే [more]

Update: 2019-11-29 02:00 GMT

మళ్ళీ అమరావతి కళకళలాడుతోంది. ఎక్కడా అంటే సవరించిన ఇండియా మ్యాపులో, తమ్ముళ్ళే మెదళ్ళలో. అలాగే అనుకూల మీడియాలో. మొత్తానికి జగమొండి అయిన జగన్ ముఖ్యమంత్రి కుర్చీలో ఉండగానే అమరావతి మాట అంతటా వినిపిస్తోందంటే చంద్రబాబా మజాకా? అని తమ్ముళ్ళు అంటున్నారు. అమరావతి అన్నది చంద్రబాబు మానసపుత్రిక. ఎవరు అవునన్నా కాదన్నా అమరావతి పేరు మీద ఒక్క ఇటుక పేర్చినా కూడా ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలోకే వెళ్ళిపోతుంది. చంద్రబాబు నవ్యాంధ్రకు తొలి సీఎం కావడం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అది. 2014లో చంద్రబాబు సీఎం కావాలని, టీడీపీ గెలవాలని ఆ సామాజికవరం బలంగా కోరుకోవడం వెనక చాలా పెద్ద కధే ఉంది. ఆ కధ ప్రకారం అమరావతి రూపకల్పన అంతా నడిచింది. ఈ కధలన్నీ తెలిసిన జగన్ నవ్యాంధ్రకు రెండవ ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే జగన్ అమరావతిని కదిపే పరిస్థితి అయితే ఇపుడు లేదు. అలా చంద్రబాబు వేసిన బంధంలో ఆయన ఇరుక్కుపోయారు.

ఆ హక్కుతోనే టూర్లు….

ఇది నా అమరావతి, నేను సీఎంగా ఉండగా అమరావతి రాజధానికి శంఖుస్థాపన చేశాను అంటూ చంద్రబాబు అక్కడ నేలను ముద్దాడటం వెనక భారీ సెంటిమెంట్ ఉంది. అదే విధంగా అమరావతి పేరు మీద హక్కులన్నీ నావి అన్న ఆధిపత్య వైఖరి కూడా ఉంది. అందుకే అమరావతి నడిబొడ్డునే నిలబడి జగన్ కి చంద్రబాబు గట్టి సవాల్ చేశారు. దమ్ముంటే రాజధానిని తరలించగలరా అంటూ చంద్రబాబు చేసిన గర్జన సైతం వ్యూహాత్మకమైనదే. ఇపుడు ఎటూ జగన్ అమరావతిని కదల్చలేరు. దాంతో అమరావతి ఇటుక మీద ఇటుక జగన్ పేర్చినా అది నా వల్లేనని చెప్పుకోవడానికి చంద్రబాబుకు అదే పెద్ద అస్త్రంగా ఉంది. ఇక చంద్రబాబు అమరావతి రాజధానిని కట్టాలనుకోవడం నేను చేసిన తప్పా అని జనాలలో భావోద్వేగాన్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో నిర్మించిన కట్టడాలు కాదని అనగలరా అంటున్నారు చంద్రబాబు. ఇండియన్ మ్యాపులో అమరావతి పేరుని చేర్చడం, అంతే వేగంగా అమరావతి టూర్ పెట్టుకోవడం వెనక చంద్రబాబు మార్క్ మాస్టర్ ప్లాన్ ఉంది.

తప్పు జగన్ దే….

ఇపుడు అమరావతి కధ ఎలా ఉందంటే అక్కడ నిర్మాణాలు చేస్తే గొప్ప చంద్రబాబుది. కట్టకపోతే తప్పు జగన్ ది. అంటే అమరావతిని జగన్ ఎంత అభివ్రుధ్ధి చేసినా కూడా అక్కడ చంద్రబాబు ఖాతాలోనే కీర్తి మొత్తం పోతుంది తప్ప జగన్ వైపుకు అసలు రాదన్నమాట. ఇక అమరావతికి కేంద్రం ఇస్తున్న సాయం అంతంతమాత్రం. ఇక చంద్రబాబు మార్క్ అమరావతికి లక్ష కోట్లు కావాలి. జగన్ సర్కార్ ఇపుడున్న పరిస్థితుల్లో అందులో పదవ వంతు కూడా ఖర్చు పెట్టలేదు. అయినా కూడా పెట్టి తీరాలి. ఎందుకంటే తానుంటే అలా చేసేవాణ్ణి అని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏదో పరిపాలనా భవనాలతో సాదాగా రాజధాని అని చూపించినా ఆ తప్పు జగన్ దే. నిధులు ఇవ్వన్ని కేంద్రాన్ని బాబు ఏమీ అనరన్న మాట. మొత్తానికి ఇది ఓ విధంగా జగన్ కి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టేదే. ఆరు నెలల తరువాత కూడా అమరావతి అంటూ జబ్బలు చరుస్తూ చంద్రబాబు అక్కడ టూర్లు వేయడం నిజంగా చంద్రబాబు మార్క్ పాలిట్రిక్స్. దీనికి విరుగుడు మంత్రం జగన్ వద్ద ఉందా?

Tags:    

Similar News