ఇక నో ఎంట్రీయేనట

భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్డీఏలోకి తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇది పక్కా అంటున్నారు కమలనాధులు. గతంలో రెండుసార్లు చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన థోకాను [more]

Update: 2019-12-10 06:30 GMT

భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని తిరిగి ఎన్డీఏలోకి తీసుకునేందుకు సిద్ధంగా లేదు. ఇది పక్కా అంటున్నారు కమలనాధులు. గతంలో రెండుసార్లు చంద్రబాబు బీజేపీకి ఇచ్చిన థోకాను వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపైన, బీజేపీ పైనా విమర్శలు చేయడం లేదు. పైగా తాను తన ప్రయోజనాల కోసం మోదీని, కేంద్రాన్ని తిట్టలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.

గత నాలుగు నెలలుగా….

దీంతో పాటుగా టీడీపీ నుంచి వెళ్లిన నలుగురు రాజ్యసభ సభ్యులు గత నాలుగు నెలల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సుజనా చౌదరి తిరిగి తెలుగుదేశం పార్టీతో కలిస్తే ఏపీలో బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తాయని కేంద్రం పెద్దలతో చెబుతున్నారు. కానీ కేంద్ర నేతల నుంచి సానుకూల స్పందనలు రావడంలేదు. దీంతో చంద్రబాబు నేరుగా నాగపూర్ వెళ్లి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలసి వచ్చినా ప్రయోజనం లేకపోయింది.

వత్తిడి తెస్తుండటంతో…..

చంద్రబాబు పలు మార్గాల నుంచి వత్తిడి తెస్తుండటంతో బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాని భావిస్తుంది. చంద్రబాబు విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. అందుకే చంద్రబాబుకు నో ఎంట్రీ చెప్పాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ బీజేపీలోని అనేక మంది చంద్రబాబుతో మళ్లీ చేతులు కలపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వంటి నేతలు చంద్రబాబుతో చెలిమి అవసరంలేదని కుండబద్దలు కొట్టేస్తున్నారు.

పవన్ తో ఓకే చెప్పి…..

దీంతో చంద్రబాబుకు నో చెప్పాలని కమలదళం రెడీ అయిపోయింది. ఇందుకోసం పవన్ కల్యాణ్ పార్టీతో కలసి వెళితే బెటరని భావిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ గ్లామర్ తో పాటు, ,మోడీ ఇమేజ్ తో నెగ్గుకు రావచ్చన్న అంచనాలో కమలం పార్టీ పెద్దలున్నారు. అందుకే అతి త్వరలోనే పవన్ తో జత కట్టి పార్టీని పటిష్టం చేసుకునే పనిలో పడాలని నిర్ణయించారు. చంద్రబాబును మాత్రం దరి చేరనివ్వకూడదని ముఖ్యంగా అమిత్ షా భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. అయితే చంద్రబాబు మాత్రం బీజేపీతో స్నేహానికి ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం విశేషం.

Tags:    

Similar News