యాక్టివ్ ఎందుకయ్యారో

నన్నపనేని రాజకుమారి మళ్లీ యాక్టివ్ ఎందుకయ్యారు? వయసులోనూ, రాజకీయాల్లోనూ సీనియర్ అయిన నన్నపనేని రాజకుమారి ఎప్పుడూ ఇంత యాక్టివ్ గా రాజకీయాల్లో లేరు. ఆమె కాంగ్రెస్ నుంచి [more]

Update: 2019-09-13 03:30 GMT

నన్నపనేని రాజకుమారి మళ్లీ యాక్టివ్ ఎందుకయ్యారు? వయసులోనూ, రాజకీయాల్లోనూ సీనియర్ అయిన నన్నపనేని రాజకుమారి ఎప్పుడూ ఇంత యాక్టివ్ గా రాజకీయాల్లో లేరు. ఆమె కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనింది లేదు. అలాగే నన్నపనేని రాజకుమారిని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా పెద్దగా పట్టించుకుందీ లేదు. 2014 ఎన్నికలలో నన్నపనేని రాజకుమారి కుమార్తె వైసీపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. అయినా నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు.

పవర్ లో ఉన్నప్పుడు కూడా…..

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నన్నపనేని రాజకుమారి పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ తక్కువనే చెప్పాలి. సీనియర్ నేత కావవడం, పార్టీలు మారడం, వయసు మీరి పోవడంతో ఆమెకు టిక్కెట్ కూడా టీడీపీలో కేటాయించే పరిస్థితి లేదు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా పేరున్న నన్నపనేని రాజకుమారి 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆమెను ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా చంద్రబాబునాయుడు నియమించారు. ఆమె ఆ పదవిని బాగా ఎంజాయ్ చేశారు.

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా….

ఎక్కడ మహిళలపై అకృత్యాలు, హత్యాచారాలు జరిగినా వెంటనే నన్నపనేని రాజకుమారి వెళ్లిపోయేవారు. బాధితురాలికి అండగా నిలబడేవారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నన్నపనేని రాజకుమారి గత ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో తిరిగారు. పార్టీ అధిష్టానం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోయినా తనకంటూ ఉన్న ఇమేజ్ తో నన్నపనేని రాజకుమారి స్థానిక పార్టీ నేతలతో కలసి పోయేవారు. మీడియాకు చేరువగా ఉండేవారు. కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి నెలన్నర అయినా నన్నపనేని రాజకుమారి తన పదవికి రాజీనామా చేయలేదు.

దిగిపొమ్మనందునేనా?

పైగా జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. కానీ జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో వెనుదిరిగారు నన్నపనేని రాజకుమారి. చివరకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా జగన్ తనను కొనసాగించరని నిర్ణయించుకున్న నన్నపనేని చివరకు రాజీనామా చేశారు. అయితే తనను పదవి తప్పుకునేలా వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేదించిందని నన్నపనేని ఆరోపిస్తున్నారు. అందుకే నిన్న జరిగిన చలో ఆత్మకూరు కార్యక్రమంలో చంద్రబాబు హౌస్ అరెస్ట్ కావడంతో ఆయన నివాసానికి వచ్చి అరెస్ట్ అయ్యారు. ఇంత వయసులోనూ నన్నపనేని రాజకుమారి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు కూడా నన్నపనేని పార్టిసిపేషన్ ను ప్రశంసించారని చెబుతున్నారు.

Tags:    

Similar News