నాని గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ నటీనటులు: నాని, సీనియర్ నటి లక్ష్మి, కార్తికేయ గుమ్మకొండ, ప్రియాంక అరుళ్మోహన్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిళ్ళ, ప్రియదర్శి తదితరులు మ్యూజిక్ [more]

Update: 2019-09-13 08:50 GMT

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు: నాని, సీనియర్ నటి లక్ష్మి, కార్తికేయ గుమ్మకొండ, ప్రియాంక అరుళ్మోహన్, వెన్నెల కిషోర్, అనీష్ కురువిళ్ళ, ప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: అనిరుద్
సినిమాటోగ్రఫీ: మీరోస్లా బ్రజక్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాత: మోహన్ చెరుకూరి, నవీన్ యెర్నేని, రవి శంకర్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: విక్రమ్. కె. కుమార్

‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా హిట్ టాకొచ్చినా.. కలెక్షన్స్ రాలేదని ఆ సినిమాని ప్లాప్ అని ఒప్పుకున్న నాని… నాగార్జున తో ‘దేవదాస్’ సినిమా చేశాడు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘దేవదాస్’ లో నాని కామెడీ డాక్టర్ గా కామెడీ పండించాడు. కానీ నాగ్ కూడా నానికి హిట్ ఇవ్వలేకపోయాడు. తర్వాత గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే ఎమోషనల్ క్రీడా నేపథ్యంలో సినిమా చేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కానీ కలెక్షన్స్ మాత్రం ఓకె ఓకె. ‘జెర్సీ’ తర్వాత ప్లాప్స్ లో ఉన్న విక్రమ్ కుమార్ ని నమ్మి ‘గ్యాంగ్ లీడర్’ అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేసాడు. ‘గ్యాంగ్ లీడర్’ సినిమాకి మెగా ఫాన్స్ నుండి వ్యతిరేకత వచ్చినా.. వాళ్ళని కూల్ చెయ్యడమే కాదు.. టైటిల్ విషయంలోనూ నాని వెనక్కి తగ్గలేదు. ఇక సినిమా మీద మొదటి నుండి కాస్త తక్కువ బజ్ ఉంది. కానీ నాని చేసిన సోలో ప్రమోషన్స్ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇక నాని కూడా ఈ సినిమా కామెడీ హిట్ అంటూ ప్రచారం చెయ్యడంతో.. ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. తాజాగా ఈ శుక్రవారం నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నాని ‘గ్యాంగ్ లీడర్’ తో ఎలాంటి హిట్ కొట్టాడో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

పెన్సిల్ పార్దసారధిని(నాని ఒక స్టోరీ రైటర్ గా మారాలి అనుకుంటాడు. అందుకే రకరకాల క్రైం సినిమాలు చాసోతో కథలు రాసేస్తుంటాడు. మరో పక్క ఒక బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. ఈ బ్యాంకు రాబరీలో పాల్గొన్న ఐదుగురిని మోసం చేసి ఆరోవాడు దేవ్ (కార్తికేయ‌) ఆ డ‌బ్బుతో పరార్ అవుతాడు. అంతేకాదు ఆ దొంగ‌.. పోలీసుల ఛేజ్ లో దేవ్ ఎస్కేప్ అవుతాడు. ఇక ఆ బ్యాంకు రాబరిలో దెబ్బతిన్న ఐదుగురు ఆడవాళ్లు ఒక్కటవుతారు. వారంతా క్రైమ్ నవల్లు రాసే పెన్సిల్ పార్దసారధిని(నాని) కలుస్తారు.హాలీవుడ్ సినిమాలు చూస్తూ నవల్లు రాసే అతని అసలు ట్యాలెంట్ గురించి తెలియక…అతని సాయంతో తమ డబ్బు పట్టుకుని పారిపోయిన ఆ మోస‌గాడి(కార్తికేయ‌) పట్టుకోవాలి చూస్తారు. అసలు ఆ ఐదుగురు ఆడవాళ్లు ఎవరు? ఆ ఐదుగురికి ఉన్న సంబంధం ఏమిటి? మరి వారితో పెన్సిల్ పార్ధసారది కలిసి ఆ కేసు ని సాల్వ్ చేశాడా? చివ‌రికి ఆ బ్యాంకు రాబరీ దొంగని పెన్సిల్ పార్ధసారది ఆ ఐదుగురు ఆడవాళ్ళతో కలిసి ఎలా పట్టుకున్నాడు? అన్న‌దే మిగతా కథ.

నటీనటుల నటన:

ఎప్పటిలాగే నాని నేచురల్ నటనతో పెన్సిల్ పార్ధసారధిగా ఇరగదీసాడు. ఐదుగురు అమ్మాయిలకు గ్యాంగ్ లీడర్ గా నాని నటన బావుంది. నాని తన పెర్ఫామెన్స్ తో సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ లో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని అలాగే కొన్ని కామెడీ సన్నివేశాల్లో తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా నటించాడు. విలన్ రోల్ ప్లే చేసిన హీరో కార్తికేయ కూడా రేసర్ గా స్టైలిష్ విలనిజంలో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుల్ మోహన కొన్ని లవ్ సీన్స్ లో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. లక్ష్మీ, శరణ్య.. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు మరియు వెన్నెల కిషోర్ కూడా తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాలంటే రెండు సార్లు చేసూస్తేగాని అర్హం కావు.. అనుకునేలా ఉంటాయి ఆయన చేసే సినిమాలు. కానీ నేచురల్ స్టార్ నాని సినిమాలంటే నేచురల్ నటనతో నాని ఆకట్టుకోవడమే కాదు.. కొన్నిసార్లు నాని కామెడీ ఎంటర్టైనింగ్ తో అదరగొట్టేసాడు. ఇక విక్రమ్ – నాని కలిస్తే ఎలాంటి ఆసక్తికర మూవీ వస్తుందో అనుకుంటే.. రివెంజ్ కామెడీగా గ్యాంగ్ లీడర్ వచ్చింది. మరి సినిమా విషయంలోకెళితే.. సినిమా మొదలైన చాలా సేపటి వరకు కాస్త కథనం నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.అలా అలా నెమ్మదిగా కథలోని ఒక్కొక్క పాత్ర చేరుతుండడంతో సినిమాపై మెల్లగా ఆసక్తి ఎక్కువవుతుంది. ఇలా ఫస్టాఫ్ లోని అక్కడక్కడా లాగ్ అనిపిస్తుంది కానీ… అది పక్కన పెడితే మొత్తం ఆ ఐదుగురు ఆడవాళ్ళ గ్యాంగ్ మరియు నానీల మధ్య వచ్చే కామెడి ఎపిసోడ్లు మరియు వెన్నెల కిషోర్ తో కామెడీ ట్రాక్ ఆకట్టుకుంటాయి. ఆలాగే క్లైమాక్స్ లో నాని, కార్తికేయతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఎక్స్‌ట్రార్డినరీగా అనిపిస్తుంది. కాకపోతే కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం వంటి అంశాలు మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. దీనికి తోడు సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొడుతోంది. అలాగే కథ అక్కడక్కడా ఇంట్రెస్టింగ్ మారుతూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటాయి. ఇంకా సినిమాలో ఉన్న బలమైన ఎమోషనల్ రివేంజ్ కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు అనిపిస్తుంది. విక్రమ్ కుమార్ తాను రాసుకున్న కథ మరియు దాన్ని తెరకెక్కించిన విధానం ఒక కొత్త కథను చూసిన ఫీలింగ్ ను సినిమా చూసే ప్రేక్షకుడికి ఇస్తుంది. అలాగే నాని మరియు కార్తికేయల పాత్రలను ఎక్కడా కూడా తగ్గించకుండా విక్రమ్ తెరకెక్కించిన తీరు చాలా బాగుంది.

సాంకేతికంగా…

సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన సాంగ్స్ ఆకట్టుకోలేకపోయినా.. నేపధ్య సంగీతం మాత్రం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాల బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. లవ్ సీన్స్ లో విజువల్స్ ను కెమెరా మాన్ చాలా సహజంగా చూపించాడు. ఇక ఎడిటింగ్ బాగుంది ఓకె గాని… సెకండాఫ్ ని లేపెయ్యయాల్సిన సీన్స్ చాలా ఉన్నప్పటికీ…. అలా వదిలేసారు. ఆ సీన్స్ ని ట్రిమ్ చేసినట్టయితే… సినిమాకి ప్లస్ అయ్యేది. మైత్రి మూవీస్ వారి నిర్మాణ విలువలు చాల బాగున్నాయి

ప్లస్ పాయింట్స్:

కథ కొత్తగా ఉండడం, కథనం, నాని నటన, కార్తికేయ నటన, కథలోని ట్విస్ట్ లు, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:

స్లో నేరేషన్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సీన్స్, సాంగ్స్, ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్ గా అనిపించడం

 

రేటింగ్: 2.75 /5

Tags:    

Similar News