గ్యాంగ్ లీడర్ ప్రివ్యూ టాక్

విక్రమ్ కె కుమార్ – నాని కాంబినేషన్ లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మంచి అంచనాలు మధ్య మరి కొన్ని గంటల్లో రిలీజ్ అయిపోతుంది. విక్రమ్ కి [more]

Update: 2019-09-13 04:45 GMT

విక్రమ్ కె కుమార్ – నాని కాంబినేషన్ లో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ మంచి అంచనాలు మధ్య మరి కొన్ని గంటల్లో రిలీజ్ అయిపోతుంది. విక్రమ్ కి ఈమూవీ హిట్ అవ్వడం చాలా అవసరం. మొదటి నుండి చెపుతున్నట్టు ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ అంటున్నారు ప్రీమియర్ చూసిన ప్రేక్షకులు. అసలు ఈ సినిమా ఎలా ఉందో? ప్రివ్యూ టాక్ ఏంటో చూద్దాం పదండి.

స్లోగా స్టార్టయినా…..

సినిమా స్లో గా స్టార్ట్ అయినా ఆ తరువాత ఊపందుకుంటుందట. మధ్యమధ్య లో వచ్చే కామెడీ సీన్స్ తో పాటు వెన్నల కిషోర్ కామెడీ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంటర్వెల్ వరకు ఎంటర్ టైనర్ గా సాగే స్టోరీ లో ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ వస్తుంది. అది సెకండ్ హాఫ్ లో కూర్చునేలా చేస్తుందట. సీరియస్ మోడ్ సాగే కథలో తనదైన పకడ్బందీ స్క్రీన్ ప్లే‌తో ప్రీ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ సినిమాతో ఎమోషనల్‌గా సాగేలా చేయడంలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యాడు అని చెబుతున్నారు.

ఎమోషనల్ గా…..

క్లైమాక్స్ లో నాని తన యాక్టింగ్ తో అందరిని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాడు అని చెబుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన ప్రియాంక, అలానే సీనియర్ నటులు లక్ష్మి, శరణ్య మోహన్‌లు తమ పాత్రలకు న్యాయం చేశాసారని చెబుతున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ ఒక ఎత్తయితే అనిరుధ్ మ్యూజిక్ మరొక ఎత్తు అని చెబుతున్నారు. నెగటివ్ రోల్ లో నటించిన కార్తికేయ ఈసినిమా తన కెరీర్ కి ప్లస్ అవుతుందని చెబుతున్నారు. నాని ఖాతాలో గ్యాంగ్ లీడర్ మరో హిట్ అని చెబుతున్నారు.

Tags:    

Similar News