వారసత్వం రాజకీయాలకే పరిమితం చేయలేదుగా?

తండ్రుల రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు ఫ్యాక్షనిజాన్ని కూడా వీరు వారసత్వంగా తీసుకున్నట్లు కన్పిస్తుంది. నంద్యాల, ఆళ్లగడ్డల్లో భూమా కుటుంబం ఒకప్పుడు ఆధిపత్యం ప్రదర్శించేది. భూమా ఫ్యామిలీ [more]

Update: 2020-11-22 06:30 GMT

తండ్రుల రాజకీయ వారసత్వాన్ని మాత్రమే కాదు ఫ్యాక్షనిజాన్ని కూడా వీరు వారసత్వంగా తీసుకున్నట్లు కన్పిస్తుంది. నంద్యాల, ఆళ్లగడ్డల్లో భూమా కుటుంబం ఒకప్పుడు ఆధిపత్యం ప్రదర్శించేది. భూమా ఫ్యామిలీ నంద్యాల, ఆళ్లగడ్డను తమ అడ్డాలుగా చేసుకుని రాజకీయం చేసేవారు. భూమా దంపతుల మరణంతో వారి వారసులు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలోనూ, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి ఒకసారి విజయం సాధించారు. ఈ రెండు ఉప ఎన్నికలే కావడం విశేషం.

భూమా దంపతుల మరణంతో….

సాధారణ ఎన్నికల్లో భూమ ఫ్యామిలీ దారుణంగా ఓటమి పాలయింది. అయితే గత కొంతకాలంగా నంద్యాలలో శిల్పా, భూమా ఫ్యామిలీల మధ్య మళ్లీ రగడ ప్రారంభమయింది. భూమా నాగిరెడ్డి ఉన్నప్పుడు కూడా శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థిగా ఉండేవారు. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనేవి. భూమా నాగిరెడ్డి వైసీపీలో ఉంటే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో ఉండేవారు. భూమా నాగిరెడ్డి వైసీపీలో చేరగానే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. నాగిరెడ్డి మరణం తర్వాత తిరిగి శిల్పా కుటుంబం వైసీపీలో చేరింది.

ఎప్పుడూ అంతే…..

ఇప్పుడు భూమా అఖిలప్రియ, శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి మధ్య ఈ రకమైన విభేదాలు మొదలయ్యా.యి. ఇటీవల వైసీపీ నేత హత్యకు గురికావడంతో దీని వెనక భూమా అఖిలప్రియ అనుచరులున్నారని శిల్పా ఆరోపించారు. ఇద్దరూ సవాల్ మీద సవాళ్లు విసురుకున్నారు. తన ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా భూమా అఖిప్రియ ప్రకటించారు. ఇక తాజాగా అబ్దుల్ సలాం ఆత్మహత్యపై కూడా ఇద్దరూ రాజకీయం మొదలుపెట్టారు.

మళ్లీ మొదలయిందే….

అబ్బుల్ సలాం కుటుంబంఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్యలకు శిల్పా కుటుంబమే కారణమని అఖిలప్రియ ఆరోపిస్తున్నారు. అయితే 3వ తేదీన ఆ కుటుంబం మరణిస్తే 11న పరామర్శకు వచ్చి అఖిలప్రియ రాజకీయం చేస్తున్నారని శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విమర్శిస్తున్నారు. నంద్యాలలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయినట్లే కన్పిస్తుంది. తమ క్యాడర్ ను కాపాడుకునేందుకు, ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు యువనేతలిద్దరూ తగ్గడం లేదు. దీంతో నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

Tags:    

Similar News