నందిగం సురేష్ వైఖ‌రిలో మార్పు.. వైసీపీ నేత‌ల చ‌ర్చ

మార్పు స‌హ‌జం. అయితే, ఆ మార్పు.. అనూహ్యంగా వ‌స్తేనే చ‌ర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చే వైసీపీలోనూ సాగుతోంది. గుంటూరు జిల్లా బాప‌ట్లకు చెందిన ఎంపీ నందిగం [more]

Update: 2020-11-09 02:00 GMT

మార్పు స‌హ‌జం. అయితే, ఆ మార్పు.. అనూహ్యంగా వ‌స్తేనే చ‌ర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఇలాంటి చ‌ర్చే వైసీపీలోనూ సాగుతోంది. గుంటూరు జిల్లా బాప‌ట్లకు చెందిన ఎంపీ నందిగం సురేష్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింద‌ని.. దీనికి రీజ‌నేంట‌ని.. వైసీపీ సీనియ‌ర్లు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణంగా ప్రభుత్వానికి, మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌కు వ్యతిరేకంగా నందిగం సురేష్ ఎక్కడా ప‌న్నెత్తు మాట కూడా అన‌రు. రాజ‌ధాని విష‌యంలో తాను స్థానికుడు అయిన‌ప్పటికీ.. త‌నుపుట్టి పెరిగిన ప్రాంత‌మే అయిన‌ప్పటికీ.. మూడు రాజ‌ధానులు బెట‌ర్ అని జై కొట్టారు.

వ్యతిరేకంగా వ్యాఖ్యలు…..

అలాంటి ఎంపీ నందిగం సురేష్ తాజాగా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేశార‌ని.. పెద్ద ఎత్తున వైసీపీలో చ‌ర్చకు వ‌స్తున్నాయి. ఒక‌టి.. రాజ‌ధాని రైతుల‌కు బేడీలు వేయ‌డాన్ని బ‌హిరంగంగానే నందిగం సురేష్ ఖండించారు. పోలీసుల వైఖ‌రిపై విరుచుకుప‌డ‌లేదు. కానీ ఈ విష‌యాన్ని మాత్రం త‌ప్పుప‌ట్టారు. ఇది ఒకింత చ‌ర్చకు వ‌చ్చినా.. అస‌లు విష‌యం నవంబరు 2 నుంచి పాఠ‌శాలలు ప్రారంభం అవుతుండ‌డంతో స్థానిక మ‌హిళ‌లు కొంద‌రు ఎంపీకి ఫోన్లు చేశార‌ని.. అప్పుడే పాఠ‌శాల‌లు ఎందుకు.. ? ఒక‌వైపు రాజ‌ధాని ఉద్యమం.. మ‌రోవైపు క‌రోనా తీవ్రత ఉంది.. కదా.. ఇప్పుడు వాయిదా వేయాల‌ని ఆయ‌న‌ను కోరిన‌ట్టు గుంటూరులో చ‌ర్చ జ‌రుగుతోంది.

మాట ఎవరూ వినడం లేదని…..

అయితే, దీనిపై నందిగం సురేష్ ఏం చేస్తాం.. మేం కూడా చెప్పాం.. అయినా .. మా మాట వినేవారు ఎవ‌రుంటారు ? అనే జ‌వాబిచ్చారట‌. అంతేకాదు.. అయినా మీకు ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చింది క‌దా.. పంపితే మీ పిల్లల్ని పంపించండి.. లేక‌పోతే.. లేదు..! అని జ‌వాబిచ్చార‌నేది వైసీపీ సీనియ‌ర్ల చ‌ర్చల సారాంశం. అయితే, ఇందులో ఎంపీపై ఎందుకంత‌గా చ‌ర్చ సాగుతోంది ? అంటే.. “మామాట వినేవారు ఎవ‌రు?“ అని ఆయ‌న అస‌హ‌నం వ్యక్తం చేయ‌డంపైనే.

టోన్ మరింత పెరుగుతుందా?

నిజానికి ఇప్పటి వ‌ర‌కు నందిగం సురేష్ ఇలా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయ‌లేదు. అనేక విష‌యాల్లో ఆయ‌న విభేదించిన‌ట్టు గ‌తంలోనూ వార్తలు వ‌చ్చాయి. కానీ, ఇప్పుడు ఆయ‌న ఎక్కడో బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని.. మున్ముందు.. ఆయ‌న టోన్ మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందా ? అనే యాంగిల్‌లో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. జిల్లా వైసీపీలో కొంద‌రు నేత‌ల తీరుతో పాటు ఆయ‌న ఎంపీగా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు, కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు త‌న‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆవేద‌న ఆయ‌న‌లో ఎక్కువుగా ఉంద‌ట‌. ప్రెస్‌మీట్లకు మాత్రం బాగా వాడుకుంటున్నార‌ని కూడా నందిగం సురేష్ వాపోతున్న ప‌రిస్థితి ఉంద‌ట‌. దీంతో సురేష్ త‌న అస‌హ‌నాన్ని ఇలా బ‌య‌ట పెట్టుకున్నారంటున్నారు.

Tags:    

Similar News