బాలయ్యనే ముగ్గులోకి దించుతారా ?

బాలకృష్ణ. నందమూరి వంశాంకురం. అన్న ఎన్టీయార్ కి అసలైన వారసుడు. సినీ రంగంలో ఎన్టీయార్ ఖ్యాతిని గత నాలుగు దశాబ్దాలుగా నిలబెట్టిన బాలయ్య రాజకీయంగా మాత్రం అదే [more]

Update: 2020-07-23 14:30 GMT

బాలకృష్ణ. నందమూరి వంశాంకురం. అన్న ఎన్టీయార్ కి అసలైన వారసుడు. సినీ రంగంలో ఎన్టీయార్ ఖ్యాతిని గత నాలుగు దశాబ్దాలుగా నిలబెట్టిన బాలయ్య రాజకీయంగా మాత్రం అదే ఊపు కనబరచలేకపోయారు. ఇక బాలయ్య తనకు జగన్ వీరాభిమాని అని చెప్పుకుంటున్నారు. అదే అభిమాని ఏపీకి సీఎంగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు జగన్ ఉప్పూ నిప్పులా ఉంటారు. అదే సమయంలో నందమూరి వంశం మీద మాత్రం ఎవరికీ కోపం కానీ ద్వేషం కానీ లేవు. పైగా వారి పట్ల సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది. జగన్ కూడా అన్న ఎన్టీయార్ అంటే చాలా ఇష్టపడతారు. ఆయన కుమారుడు బాలకృష్ణ విషయంలో కూడా అంతే. బాలయ్య తనను రాజకీయంగా ఎంత హార్ష్ గా విమర్శించినా జగన్ అసలు పట్టించుకోరు అంటారు.

బాలయ్య బాణాలు…..

ఇక బాలకృష్ణ జగన్ని చాలా గట్టిగానే ఈ మధ్య తగులుకున్నారు. అసలు ఏపీలో పాలన లేదు అనేశారు. పధకాలు అంటే మావి, పాలన అంటే మా బావది అన్నది బాలయ్య సిధ్ధాతం. మళ్లీ టీడీపీవే అధికారంలోకి వస్తుంది అని బాలకృష్ణ ఈ మధ్య మహానాడు లో గట్టిగానే గర్జించారు. పైగా జగన్ సర్కార్ ది మూడు నాళ్ళ ముచ్చట అని కూడా విమర్శలు చేశారు. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు వస్తాయని కూడా జోస్యం చెప్పారు.

లేఖతో అలా …..

ఇన్నిరకాలుగా విమర్శలు చేసిన బాలకృష్ణ కరోనా మహమ్మారి ఏపీని ఆవరించిన వేళ భారీగా విరాళాలు రెండు ప్రభుత్వాలకు ఇచ్చారు. ఏపీకి కోటి రూపాయల సాయం చేసి తాను నిజమైన కధానాయకుడిని అనిపించుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయమని, అక్కడ ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయమని ఈ మధ్య జగన్ కి లేఖ రాశారు. అది ఒక విధంగా ఆశ్చర్యం కలుగచేసింది. బాలకృష్ణ ఇలా తన సమస్యలు జగన్ కి చెప్పి ఆయన జిల్లాకో మెడికల్ కళాశాల మంజూరు చేయడాన్ని కూడా హర్షించారు. దీంతో బాలకృష్ణ వైపు నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ రావడం పట్ల వైసీపీలో కూడా ఆనందం వ్యక్తం అవుతోందిట.

జగన్ ఓకేనా…?

ఇక బాలకృష్ణ అడిగినవి జగన్ ఇప్పటికే మంజూరు చేయాలనుకుంటున్నవే. అందులో వైసీపీ సర్కార్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. పైగా బాలకృష్ణ కోరిక తీర్చామన్న సంత్రుప్తి కూడా వస్తుంది. బాలకృష్ణ కోరినట్లుగానే హిందూపురాన్ని ఎటూ కొత్త జిల్లా చేస్తారు.అదే విధంగా అక్కడ మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇక వీటితో పాటు ఎన్టీయార్ పేరిట ఏపీలో ఒక జిల్లాను కూడా కొత్తగా జగన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అది కచ్చితంగా బాలకృష్ణ మనసుని కదిలించేదే అవుతుంది. ఈ పరిణామాల తరువాత బాలయ్య మరింతగా జగన్ సర్కార్ మీద మమకారం పెంచుకుంటారని ఆశిస్తున్నారు. పైగా సుదీర్ఘ కాలం తన బావ ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు జగన్ చేస్తే బాలకృష్ణ మెచ్చుకోకుండా ఉండగలరా అన్న మాట కూడా వస్తోంది. మరో వైపు బాలయ్య వంటి ఎన్టీయార్ వారసుడినే ఆకట్టుకుంటే ఆయన నోటి వెంటే ఇది మంచి సర్కార్ అనిపిస్తే ఇక టీడీపీ పని సరి, అంతకంటే ఎక్కువగా బాబు రాజకీయానికే చెల్లు చీటి అవుతుందని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి బావమరిది జగన్ కి రాసిన లేఖ బాబు గారి రాజకీయ జీవితాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.

Tags:    

Similar News