బాలయ్యకు మరోసారి భంగపాటు తప్పదా?

హిందూపురంలో మరోసారి బాలకృష్ణకు భంగపాటు తప్పేట్లు లేదు. హిందూపురం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తన [more]

Update: 2021-03-10 11:00 GMT

హిందూపురంలో మరోసారి బాలకృష్ణకు భంగపాటు తప్పేట్లు లేదు. హిందూపురం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు తన పట్టును నిలబెబ్టుకోవాలని బాలకృష్ణ కూడా శ్రమిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లోనే టీడీపీకి గట్టి దెబ్బ పడింది. దీంతో బాలకృష్ణ మున్సిపాలిటీని చేజార్చుకోకూడదని భావిస్తున్నారు. పార్టీ శ్రేణులకు అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

పంచాయతీ ఎన్నికల్లో….

హిందూపురం నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో పడ్డారు. 38 పంచాయతీలకు గాను ఎనిమిది పంచాయతీల్లోనే టీడీపీ గెలిచింది. దీంతో బాలకృష్ణ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీని గెలుచుకుని తన పవర్ తగ్గలేదని బాలకృష్ణ నిరూపించుకోవాలని భావిస్తున్నారు.

గత ఎన్నికల్లోనూ…..

అయితే గత మున్సిపల్ ఎన్నికల్లోనే హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి పెద్దగా కలిసి రాలేదు. నాటి ఎన్నికల్లోనే 38 వార్డులకు గాను టీడీపీ 19, వైసీపీ 19 వార్డులు గెలుచుకున్నాయి. అయితే అప్పట్లో బాలకృష్ణ ఎమ్మెల్యేగా, తిప్పేస్వామి ఎమ్మెల్సీగా ఎక్స్ అఫిషియో ఓటును వినియోగించుకోవడంతో మున్సిపల్ ఛైర్మన్ చచ్చీ చెడీ దక్కించుకున్నారు. అయితే ఈసారి పరిస్థితి అంత సులువుగా లేదన్నది విశ్లేషకుల అంచనా.

వైసీపీకే ఛాన్స్….?

ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని చెప్పింది. దీంతో హిందూపురం కూడా జిల్లా కేంద్రంగా మారనుంది. మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు కానుంది. దీంతో హిందూపురం మున్సిపాలిటి వైసీపీ గెలిచే ఛాన్సు ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే బాలకృష్ణ మాత్రం ఎలాగైనా హిందూపురం మున్సిపాలిటీని గెలిపించుకుని బావకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఏం జరుగుుతుందో చూడాలి.

Tags:    

Similar News