బాలయ్య హుంకరిస్తే.. ఆ కేసు బయటకు తీస్తారా ?

బాలకృష్ణ కాల్పుల కేసు మళ్ళీ టాలీవుడ్ ఇప్పుడు తెరపైకి తేనుందా ..? నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదిక గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ [more]

Update: 2020-05-30 03:30 GMT

బాలకృష్ణ కాల్పుల కేసు మళ్ళీ టాలీవుడ్ ఇప్పుడు తెరపైకి తేనుందా ..? నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదిక గా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అనుమానాలు సృష్టిస్తున్నాయి. తుపాకీ పట్టుకున్నవారితో ఏమి మాట్లాడగలం అంటూ బాలయ్య పై పరోక్షంగా పాత కేసు గుర్తు చేసేవిధంగా వరుణ్ ఈ తూటా పేల్చారు. అదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇంతటి హాట్ హాట్ కామెంట్ పై బాలయ్య శిబిరం వైపు నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.

కాల్పుల కేసు కలసి వచ్చిందా … ?

2004 జూన్ 3 న నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి లు బాలకృష్ణ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీలోనే కాదు దేశంలోనే సంచలనం అయింది. ఆ సమయంలో టిడిపి వైఎస్సాఆర్ ప్రభంజనానికి ప్రతిపక్షంలో ఉంది. అయినా దొరికిన అవకాశాన్ని వైఎస్ రాజకీయ అవసరాలకు వినియోగించుకోలేదు సరికదా ఆ కేసులో పురంధరేశ్వరి విజ్ఞప్తితో సాయం చేశారనే పలువురు అంటూ ఉంటారు. మొత్తానికి ఈ కేసు శరవేగంగా సాగి బాలయ్య మానసిక స్థితి సరిగా లేదన్న వైద్యుల సర్టిఫికెట్ తో కోర్ట్ లో క్లోజ్ అయిపోయింది. దీనిపై నాటి వైఎస్ సర్కార్ సైతం పై కోర్ట్ కి అప్పీల్ కి వెళ్లకుండా పరోక్ష సాయం అందించింది కూడా. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు చిరంజీవి టార్గెట్ గా బాలయ్య చేస్తున్న హడావిడికి చెక్ పెట్టేందుకు మెగా ఫ్యామిలీ టాలీవుడ్ రాజకీయం కోసం బయటకు తీసినట్లే కనిపిస్తుంది.

టాలీవుడ్ లో ఆధిపత్య పోరు ఎటువైపుకి …

మొత్తానికి తాజా ఎపిసోడ్ చూస్తే టాలీవుడ్ లో మాత్రం పూర్తి అనారోగ్య పోటీ తో పాటు అనేక రకాల సమస్యలు తొంగిచూస్తున్నాయన్నది స్పష్టం అవుతుంది. ఆధిపత్యం కోసం ఒక పక్క రాజశేఖర్ వర్గం కొట్లాడుతూ ఉంటే మరోపక్క మెగా ఫ్యామిలీ పూర్తి స్థాయి గ్రిప్ ను తెచ్చుకునేందుకు ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు పోతుంది. చిరంజీవి అటు కెసిఆర్, ఇటు జగన్ ప్రభుత్వాలతో సఖ్యత గా ఉండటం కూడా ఆయన చక్రం తిప్పేందుకు పనికొస్తుంది. మరో పక్క బాలకృష్ణ కు ఇప్పట్లో కష్టాలు పోయేలా లేవు. తెలంగాణ లో టిడిపి దాదాపు స్కూల్ క్లోజ్ అయిపోతే మరోపక్క ఏపీలో చరిత్రలో ఎన్నడూ లేని పరాజయం పసుపు పార్టీ మూటగట్టుకోవడం తో అంతా ఆయన్ను పక్కన పెట్టేశారు. టిడిపి పవర్ లో ఉన్నప్పుడు బాలయ్యను తెగ వాడుకున్న వారంతా కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. దాంతో ఇటీవల తీవ్ర అసహనానికి గురౌతున్నాడు బాలయ్య. ఆయన తాజాగా చేస్తున్న వ్యాఖ్యలు బాలయ్య చాలా ఆత్మా న్యూనతకు లోనై ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చూడాలి టాలీవుడ్ తెరపై ఇకపై ఎలాంటి ఉత్కంఠ డ్రామాలు సాగుతాయో.

Tags:    

Similar News