ఈయన అప్పటి దాకా బయటకు రారట… శపథం చేసినట్లుందే?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే కన్పిస్తుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు కొంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ [more]

Update: 2021-05-06 00:30 GMT

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే కన్పిస్తుంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు కొంత అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం లేవు. అందుకే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఆయన తిరిగి యాక్టివ్ కారని అంటున్నారు. ఏపీలో ఇంత జరుగుతున్నా ఆయన ఏమాత్రం పట్టంచుకోవడం లేదు.

తిరుపతి ఉప ఎన్నికలోనూ….

మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సరే వాటిని పక్కన పెడితే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిగింది. నల్లాారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా అది. ఇక్కడ కాంగ్రెస్ తరుపున చింతా మోహన్ బరిలోకి దిగారు. అయితే ఆయనను ఒంటరిని చేసి కాంగ్రెస్ నేతలంతా వదిలేసినట్లే కన్పిస్తుంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో కొంత పట్టుంది. ఆయన వల్ల లబ్ది పొందిన వారు కూడా అనేక మంది ఉన్నారు.

సొంత జిల్లాలో….

కానీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి వైపుకూడా తొంగి చూడలేదు. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన ఈ మాజీ ముఖ్యమంత్రి ఆర్భాటపు ప్రకటనలు చేశారు. తాను కాంగ్రెస్ ను రాష్ట్రంలో బలోపేతం చేస్తానని చెప్పారు. అంతేకాదు వెళ్లిన వారిని తిరిగి తీసుకు వస్తానని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ మాజీ ఎంపీ హర్షకుమార్ తప్పించి ఎవరూ పార్టీవైపు కూడా చూడలేదు.

కేంద్రంలో అధికారంలోకి వస్తేనే?

నిజానికి తిరుపతి ఉప ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేసి ఉంటే కొద్దో గొప్పో ఊపు వచ్చేది. అధికార వైసీపీ ఓట్లకు కొంత గండి పడేది. కానీ ఆయనకు ఏమాత్రం పట్టలేదు. దీన్నిబట్టి ఆయన మరికొంత కాలం వెయిట్ చేయాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కే పరిమితమైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప బయటకు రారట.

Tags:    

Similar News