అప్పటి వరకూ అక్కడ అసలు ఉండొద్దు

ఎంత ప్రయత్నించినా రాజకీయంగా భవిష్యత్ కు బాట దొరకడం లేదని అన్నదమ్ములిద్దరూ మదనపడుతున్నారు. ప్రస్తుతానికి వ్యాపారాలు చూసుకోవడమే బెటరని డిసైడ్ అయినట్లుంది. వాళ్లే నల్లారి బ్రదర్స్. వారికి [more]

Update: 2020-09-08 15:30 GMT

ఎంత ప్రయత్నించినా రాజకీయంగా భవిష్యత్ కు బాట దొరకడం లేదని అన్నదమ్ములిద్దరూ మదనపడుతున్నారు. ప్రస్తుతానికి వ్యాపారాలు చూసుకోవడమే బెటరని డిసైడ్ అయినట్లుంది. వాళ్లే నల్లారి బ్రదర్స్. వారికి కనుచూపు మేరలో ఆదరవు దొరకడం లేదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా పనిచేయడంతో ఆయన పూర్తిగా ఢిల్లీ రాజకీయాలకే పరిమితమవుదామని డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారా? లేరా? అన్నట్లే ఉన్నారు. ఇక సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి విషయం తీసుకుంటే ఆయన పూర్తిగా వ్యాపారాలకే పరిమితమయ్యారు.

రెండేళ్లు ముందు టీడీపీలో…

నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి గత ఎన్నికలకు రెండేళ్ల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుందన్న ఆశతో ఆయన ఆ పార్టీలో చేరారు. చంద్రబాబు కూడా చిత్తూరులో బలం, బలగం ఉన్న నల్లారి కిశోర్ కుమార్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు నామినేటెడ్ పోస్టు కూడా కేటాయించారు. ఇక 2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి దారుణంగా ఓటమి పాలయ్యారు. చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం తప్ప ఎక్కడా టీడీపీ గెలవలేదు.

ఎన్నికల ఫలితాల నుంచి…..

దీంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ డామినేషన్ బాగా ఎక్కువయింది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు నియోజకవర్గం వైపు చూడటం లేదు. పీలేరు నియోజకవర్గంలో ఆయన వెన్నంటి నడిచిన క్యాడర్ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదు. కనీసం ఫోన్ చేసినా స్పందించడం లేదంటున్నారు. ముఖ్యనేతలెవరైనా హైదరాబాద్ వెళితే మాత్రం కలుస్తున్నారట. అదీ పీలేరు నియోజకవర్గం నేతలైతేనే.

వేరే ఆప్షన్ లేదు…..

ఇక చంద్రబాబు పిలుపునిచ్చే ఏ కార్యక్రమం కూడా పీలేరు నియోజకవర్గంలో జరగడం లేదు. తెలుగుదేశం పార్టీ జెండాయే అక్కడ కన్పించడం లేదు. ఇందుకు కారణం వైసీీపీ ప్రభుత్వానికి భయపడి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు. కనీసం నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ముందు ఉంటే తాము వెనకనిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని, ఆయనే రాకుంటే తాము ఎందుకు చేయాలని క్యాడర్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి వేరే ఆప్షన్ లేదు. టీడీపీలోనే కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నికల ముందు వచ్చి తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవ్వాలన్నది నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆలోచనగా ఉంది. అయ్యగారు వచ్చే వరకూ పార్టీ ఇక్కడ బతికి బట్ట కడుతుందా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News