ఇంకో ఆప్షన్ లేదుగా

తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి పాలవ్వడం… ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళుతుండటం చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా మారింది. అయితే కొద్దిలో కొంత ఊరట కొందరు నేతలు తాము [more]

Update: 2019-07-17 12:30 GMT

తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమి పాలవ్వడం… ఒక్కొక్క నేత పార్టీని వీడి వెళుతుండటం చంద్రబాబునాయుడుకు తలనొప్పిగా మారింది. అయితే కొద్దిలో కొంత ఊరట కొందరు నేతలు తాము తెలుగుదేశం పార్టీలోనే ఉంటామని చెబుతుండటం. తాజాగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీని వీడతారన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే దీనిని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడతానని నల్లారి చెప్పారు.

ఛాన్స్ లేదని తెలిసి…..

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలోకి జంప్ చేసేందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనను కాదని భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వీలు లేదు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. జనసేనలోకి వెళ్లే అవకాశమున్నా దాని పరిస్థితీ అంతబాగా లేదు.

జిల్లా రాజకీయాలకు దూరంగా….

ఇక తన ప్రధాన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దూకుడు మీదున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క కుప్పం మినహా చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంది. దీనిని పెద్దిరెడ్డి ప్రతిభగానే జగన్ భావించి ఆయనకు మంత్రి పదవిని ఇచ్చారు. జిల్లాలో ఇప్పుడు పెద్దిరెడ్డి ఎంత చెబితే అంత. ఈ పరిస్థితుల్లో జిల్లాలో రాజకీయం చేయడం కన్నా ఐదేళ్ల పాటు హైదరాబాద్ కే పరిమితమవ్వడం మేలన్న నిర్ణయానికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వచ్చారని తెలుస్తోంది.

వెయిట్ చేయాల్సిందే….

పీలేరు నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓటమి పాలయిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మరోసారి ఐదేళ్ల పాటు వెయిట్ చేయక తప్పదు. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గానికి, పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు. కానీ సోషల్ మీడియాలో ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతుండటంతో తాను టీడీపీని వీడటం లేదని స్పష్టం చేశారు. కానీ ఆయనకు మరో ఆప్షన్ లేదన్న సెటైర్లు సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News