ఇక తలదూర్చరట.. అదే ఫైనల్ అట

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన పాలిటిక్స్ కు [more]

Update: 2020-11-05 00:30 GMT

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో తన సమైక్యాంధ్ర పార్టీ దారుణ ఓటమి తర్వాత ఆయన కొన్నేళ్లు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆయన అజ్ఞాతాన్ని వీడలేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.

కాంగ్రెస్ దారుణ ఓటమి తర్వాత….

2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా దక్కలేదు. విభజన పాపమే దీనికి ప్రధాన కారణం. అయితే పార్టీకి భవిష్యత్ ఉంటుందని ఆశించి ఇప్పటికీ కొందరు నేతలు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. కానీ కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు రాకపోవడంపై పార్టీలో సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి.

కాంగ్రెస్ ను కాపాడేందుకు…..

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా పనిచేసిన సందర్భంలో అనేక మంది నేతలు లబ్ది పొందారు. కాంగ్రెస్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిక సందర్భంగా కూడా తాను అనేక మంది నేతలను తిరిగి పార్టీలోకి తీసుకువస్తానని ప్రకటించారు. కానీ ఏ ఒక్క నేత పార్టీలో చేరేందుకు ముందుకు రాలేదు. తెలంగాణలో కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే కొనసాగుతుందని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేశారు.

ఏపీ రాజకీయాల్లో…..

అదే జరిగి ఉంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యేవారు. భవిష్యత్తు లోనూ కాంగ్రెస్ తో టీడీపీ జట్టుకట్టే ధైర్యం చేయలేదు. కమ్యునిస్టులయినా కలుపుకుంటుంది కాని, కాంగ్రెస్ ను ఏపీలో చంద్రబాబు దగ్గరకు రానివ్వరు. అందుకే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక పార్టీకి భవిష్యత్ లేదని తెలిసి మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఒక నేత ఆయనను కలసినప్పుడు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారని సమాచారం. తాను ఇక కాంగ్రెస్ పాలిటిక్స్ లో తలదూర్చనని చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే.

Tags:    

Similar News